ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ‘పుష్ప’ (Pushpa) సినిమాలు అంటేనే పుష్ప రాజ్ వర్సెస్ భన్వర్ సింగ్ షెకావత్ (Fahad Fazil). కానీ అతని కంటే పెద్ద విలన్ ఇంకొకరు ఉన్నారు అని అంటున్నారు. ఆయన టాలీవుడ్ యంగ్ హీరో అని, ‘ర్యాంపేజ్’లో ఆయనే కనిపిస్తాడు అని అంటున్నారు. ఆ విషయంలో ఈ రోజు అర్ధరాత్రి క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పుడు క్లారిటీ రావాల్సిన అంశం ‘షెకావత్ సర్ ఎక్కడ?’. అవును, ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule) సినిమాకు సంబంధించి ఇప్పటివరకు నాలుగు ఈవెంట్లు జరిగాయి.
పట్నా, ముంబయి, చెన్నై, కొచ్చి, హైదరాబాద్‌లో ఈవెంట్లు జరిగాయి. అయితే కోల్‌కతా, బెంగళూరులో ఈవెంట్లు పెడతామని టీమ్ చెప్పినా అవి జరగలేదు. ఇక జరిగే అవకాశం లేదు. ఆ విషయం పక్కన పెడితే జరిగిన ఐదు ఈవెంట్లలో ఎక్కడ భన్వర్ సింగ్ షెకావత్ అలియాస్ ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) కనిపించలేదు. కనీసం సొంత రాష్ట్రం కేరళలో జరిగిన ఈవెంట్‌లో అయినా కనిపిస్తాడేమో అని అనుకుంటే.. అక్కడా డుమ్మా కొట్టేశాడు.
వస్తాడు అని చివరి క్షణం వరకు చెప్పినా ఈవెంట్ అయిపోయింది కానీ ఆయన మాత్రం రాలేదు. పోనీ హైదరాబాద్ ఈవెంట్‌కి అయినా తీసుకొస్తారేమో అనుకుంటే ఇక్కడకూ రాలేదు. దీంతో ‘షెకావత్ సర్ ఎక్కడ?’ అనే ప్రశ్న మొదలైంది. అయితే దీనికి కొంతమంది, సినిమా టీమ్ సన్నిహితుల వాదన ఏంటంటే.. ఆయన ఏ సినిమాల ప్రెస్‌మీట్లు, ఫంక్షన్లకు రారు అని చెబుతున్నారు. అయితే రీసెంట్‌గా ఆయన హీరోగా హిట్ కొట్టిన ‘ఆవేశం’ సినిమా ఫంక్షన్‌కి అయితే వచ్చారు.
ప్రెస్ మీట్‌లో గంటల తరబడి మాట్లడారు కూడా. ఈ నేపథ్యంలో మరికొందరేమో సొంత నిర్మాణ సంస్థల సినిమాలకు వస్తారు అని కవర్ చేస్తున్నారు. ‘పుష్ప: ది రూల్’ లాంటి పాన్ ఇండియా సినిమా ప్రచారానికి ఆయన రాకపోవడం కచ్చితంగా లోటే. మరి ఆయన ఎందుకు రాలేదు? లేక ఆయనొస్తే తాము లైట్ అయిపోతామని వేరే నటులు ఎవరైనా అనుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.