Jr NTR, Gunasekhar: స్టార్ హీరోలతో విభేదాలపై గుణశేఖర్ ఏమన్నారంటే..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయస్సులోనే బాల రామాయణం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఎన్టీఆర్ గుణశేఖర్ కాంబినేషన్ లో సినిమాలు రెండుసార్లు తెరపైకి వచ్చి ఆగిపోయాయి. గుణశేఖర్ మహేష్ బాబుతో తెరకెక్కించిన ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత గుణశేఖర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా తెరకెక్కించాలని భావించారు.

అయితే ఈ సినిమాకు కథ సరిగ్గా కుదరకపోవడం వల్ల సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా తరువాత రుద్రమదేవి సినిమాలో గోనగన్నారెడ్డి పాత్రలో నటించే ఛాన్స్ జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబులకు వచ్చింది. ఈ హీరోలకు కథ నచ్చినా స్క్రిప్ట్ లో మార్పులు కోరడంతో గోనగన్నారెడ్డి పాత్ర కోసం అల్లు అర్జున్ పేరు తెరపైకి రావడం ఆ సినిమాలో అల్లు అర్జున్ నటించడం జరిగింది. అలా ఎన్టీఆర్ గుణశేఖర్ కాంబినేషన్ మూవీలు ఆగిపోయాయి.

అయితే భవిష్యత్తులో మాత్రం ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం సినిమాను తెరకెక్కిస్తున్న గుణశేఖర్ ఈ సినిమా తరువాత హిరణ్యకశప సినిమాకు డైరెక్షన్ చేయనున్నానని చెప్పారు. రుద్రమదేవి సినిమా సక్సెస్ సాధించడంతో మైథాలజీ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టానని గుణశేఖర్ అన్నారు. గోనగన్నారెడ్డి పాత్రలో నటించని హీరోలతో స్నేహ బంధం అలాగే ఉందని గుణశేఖర్ చెప్పుకొచ్చారు. వాళ్లు కోరినట్టు తీయనని చెప్పినా ఆయా హీరోలు తనను తప్పుబట్టలేదని గుణశేఖర్ పేర్కొన్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus