బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం మెరీనా అనూహ్యంగా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అన్ అపీషియల్ పోలింగ్స్ లో అందరూ శ్రీసత్య ఎలిమినేట్ అవ్వాలని ఎక్కువమంది ఓటింగ్ చేశారు. కామెంట్స్ చేశారు. కానీ, మెరీనాకి తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ అయ్యిందని బిగ్ బాస్ టీమ్ ఇంటింకి పంపించేసింది. అయితే, లాస్ట్ వరకూ ఇనాయా, ఇంకా శ్రీసత్య ఇద్దరూ ఉండటం అనేది హౌస్ మేట్స్ ని టెన్షన్ పెట్టింది. మెరీనా అసలు ఎందుకు ఎలిమినేట్ అయ్యింది. ఆమె గేమ్ ఎక్కడ దెబ్బకొట్టింది అనేది మనం ఒక్కసారి 5 కారణాలు చూసినట్లయితే.,
నెంబర్ 1 :
మెరీనా ఫస్ట్ నుంచీ టాస్క్ ల్లో దూసుకు పోలేదు. అలాగే, ఏది కూడా తనవైపు పాయింట్స్ పెట్టలేదు. అలాగే ఎదుటి వాళ్ల ఆర్గ్యూమెంట్స్ వినలేదు. ఆర్గ్యూమెంట్స్ కావాలని పెట్టుకోవాలని చూడలేదు. గట్టిగా ఫైట్ చేస్తూ మాట్లాడటం అనేది జెర్నీలో లేదు. ఫస్ట్ వీక్ నామినేషన్స్ నుంచీ చూసినట్లయితే అలా మాట్లాడే అవకాశం ఆమెకి రాలేదు. అవ్వలేదు. అందుకే , గేమ్ ఆడినట్లుగా కనిపించలేదు. రెండు మూడు వారాలు సోఫా వెనక నిలబడాల్సి వచ్చింది.
నెంబర్ 2
ఫస్ట్ వీక్ నుంచీ కూడా కిచెన్ లోనే ఎక్కువశాతం ఉండిపోయింది. వేరేవాళ్ల గేమ్ ని అబ్జర్వ్ చేయలేకపోయింది. అంతేకాదు, నామినేషన్స్ లో కూడా ఎవరు ఏ పాయింట్స్ పెడుతున్నారు అని క్యాచ్ చేయలేదు. తను చేసిన నామినేషన్స్ కూడా వీకండ్ నాగార్జున చెప్పిన హింట్స్ ని రోహిత్ మెరీనా ఇద్దరూ ఫాలో అయ్యారు. అంతేకాదు, పక్కనోళ్ల పాయింట్స్ అబ్జర్వ్ చేయకుండా , ఆర్గ్యూమెంట్స్ చేయకుండా ఉండిపోయారు. కొన్ని సందర్భాల్లో రోహిత్ ఉన్నాడని ఆగిపోయింది కూడా. ఐదోవారం అందుకే రోహిత్ ని కాపాడి తను నామినేషన్స్ లోకి వచ్చింది. అక్కడ కూడా బలంగా వాదించుకోలేకపోయింది.
నెంబర్ 3
సోషల్ మీడియాలో మెరీనాకి పెద్దగా ఫాలోయింగ్ లేదనే చెప్పాలి. చాలా వారాలు డేంజర్ జోన్ లో ఉంది. ఎలిమినేట్ అయిపోతుందనే అనుకున్నారు. కానీ, అనూహ్యంగా సేవ్ అవుతూ వచ్చింది. తను నామినేషన్స్ లో ఉన్నప్పుడు ఓట్ బ్యాంక్ ని క్రియేట్ చేస్కోలేకపోయింది. తన భర్త రోహిత్ కి రెండు వారాలు డైరెక్ట్ గా నామినేట్ అయ్యే అవకాశం, వేరేవారికోసం శాక్రిఫైజ్ చేసే ఛాన్స్ వచ్చింది. అందుకే ఆడియన్స్ లో ఆదరణ లభించింది. కానీ, మెరీనాకి అలాంటి అవకాశం మాత్రం దొరకలేదు. అందుకే వెనకబడిపోయింది.
నెంబర్ 4
ఒకవర్గానికి , కొంతమంది గ్రూప్ తో మాత్రమే మెరీనా హౌస్ లో ఉండిపోయింది. వేరేవాళ్లు ఎలాంటి స్ట్రాటజీలతో గేమ్ ఆడుతున్నారని అబ్జర్వ్ చేయలేదు. వాళ్ల పాయింట్స్ కూడా వినలేదనే చెప్పాలి. కొన్ని లాజిక్స్ క్రియేట్ చేసి మాట్లాడినా కూడా అప్పటికే మెరీనా నుంచీ చాలా ఛాన్సెస్ వెళ్లిపోయాయి. కీర్తి, ఇనాయ, ఫైమా వీళ్ల ముగ్గరూ మెరీనాని ఓవర్ టేక్ చేస్కుంటూ వెళ్లిపోయినా కూడా గుర్తించలేకపోయింది. గేమ్ లో వెనకబడింది.
నెంబర్ 5
మెరీనా గేమ్ ఓవర్ ఆల్ గా చూస్తే చాలా మంచిగా, హుందాగా నడిచింది. కానీ, బిగ్ బాస్ ప్రేక్షకులకి కావాల్సిన స్పైసీ కంటెంట్ ఇవ్వలేకపోయింది. అంటే, మిగిలిన వాళ్లు ఏదో ఒక రూపంలో తమ ఆర్గ్యూమెంట్స్ పెట్టి కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్లే. తను మాత్రం తన దృష్టికి వచ్చిన వాటిపైన మాత్రమే ఫోకస్ చేసింది. మిగతా వాళ్లతో, వాళ్లు ఆడే టాస్క్ లలో ఇన్వాల్ అయినా కూడా మెరీనాకి మంచి క్రేజ్ వచ్చి ఉండేదేమో. ఏది ఏమైనా మెరీనా 11 వారాలు హౌస్ లో తను గేమ్ ఆడిందంటే అది కేవలం తన మంచితనం వల్లే అని చెప్పుకోవచ్చు.