Balakrishna: బాలయ్య కొత్త సినిమాల ప్రకటనలు రాకపోవడం వెనుక అసలు కారణాలివేనా?

స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్య (Balakrishna) ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. బాలయ్య సినిమా అంటే మూవీ మినిమం గ్యారంటీ అని పేక్షకుల్లో అభిప్రాయం ఉంది. అదే సమయంలో బాలయ్య తన సినిమాలు అభిమానులను కచ్చితంగా మెప్పించే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు బాలయ్య స్క్రిప్ట్స్ విషయంలో జాగ్రత్తగా ఉన్నారని తెలుస్తోంది. అఖండ సినిమాకు ముందు బాలయ్య నటించిన సినిమాలు తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేశాయి.

బాలయ్య సినిమాలలో కొన్ని సీన్లకు సంబంధించి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం స్క్రిప్ట్స్ విషయంలో పట్టుదలతో ఉన్నారని కథ నచ్చకపోతే ఎలాంటి మొహమాటం లేకుండా నో చెబుతున్నారని తెలుస్తోంది. కథ నచ్చి కొన్ని సీన్లు నచ్చకపోతే దర్శకులకు ఆ విషయం చెప్పి మార్పులు చేర్పులు చేయమని చెబుతున్నట్టు భోగట్టా. అప్పటికీ ఇప్పటికీ బాలయ్య చాలా మారారని సమాచారం అందుతోంది.

బాలయ్య రెమ్యునరేషన్ 34 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. సీనియర్ హీరోలలో నంబర్ 2గా ఉన్న బాలయ్య వరుస విజయాలను సొంతం చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధిస్తున్నారు. యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ బాలయ్య బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తున్నారు. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రముఖ టాలీవుడ్ టాప్ బ్యానర్లలో నటిస్తుండటం కెరీర్ పరంగా మరింత ప్లస్ అవుతోంది.

బాలయ్య మాస్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నా ఆ సినిమాలు స్పెషల్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలకృష్ణ భారీ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus