Okka Magaadu Movie: బాలయ్య మూవీ ఫ్లాప్ కావడానికి కారణమిదే..?

స్టార్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో ఈ మధ్య కాలంలో హిట్టైన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయనే సంగతి తెలిసిందే. బాలయ్య హీరోగా నటిస్తూ భారీ అంచనాలతో రిలీజవుతున్న సినిమాలే ఎక్కువగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. బాలకృష్ణ హీరోగా వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఒక్క మగాడు సినిమా 2008 సంవత్సరం జనవరి 10వ తేదీన రిలీజైంది. ఈ సినిమాకు ముందు వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన సినిమాలు ఎక్కువగా హిట్ అయ్యాయి.

అయితే ఒక్కమగాడు మూవీ మార్నింగ్ షోకే ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలను మిగిల్చింది. తాజాగా వైవీఎస్ చౌదరి ఒక్కమగాడు మూవీ రిజల్ట్ గురించి స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బాలకృష్ణ ఒక్కమగాడు సినిమాకు ముందు వయొలెన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలలో నటించారని ఆ సమయంలో హింస లేకుండా ఒక్కమగాడు సినిమాను తెరకెక్కించడం తన తప్పైందని వైవీఎస్ చౌదరి అన్నారు. బాలయ్య మూవీ కథ విషయంలో తన ఆలోచన తప్పు కావడంతో ఆ సినిమా ఫ్లాప్ అయిందని వైవీఎస్ చౌదరి వెల్లడించారు.

బాలయ్య సినీ కెరీర్ లో మాత్రం ఒక్కమగాడు అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలవడం గమనార్హం. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా అనుష్కనటించారు. ఈ సినిమా కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు సినిమాను పోలి ఉందనే కామెంట్లు సైతం అభిమానుల నుంచి వినిపించాయి. ప్రస్తుతం బాలయ్య అఖండ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus