Rajamouli: అందుకే రాజమౌళి స్టార్ హీరోల జోలికి పోలేదట…!

రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో కూడా నొ చెప్పడానికి ఆస్కారం ఉండదు. ఏళ్ళక ఏళ్ళు సమయం పట్టినా.. హ్యాపీగా వేరే సినిమాకి కమిట్ అవ్వకుండా డేట్స్ ఇచ్చేస్తారు. కానీ రాజమౌళి మాత్రం ఇప్పటి వరకు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది లేదు. ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ వంటి వారు రాజమౌళి వల్ల స్టార్ హీరోలు అయిన వాళ్ళే తప్ప.. వాళ్ళు స్టార్ లు అయ్యాక రాజమౌళి సినిమాలు చేయడానికి వెంటపడలేదు.

అయితే కెరీర్ ప్రారంభంలో రాజమౌళి పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేశారు అన్నది సత్యం. బాలయ్య కి , చిరంజీవి కి , పవన్ కళ్యాణ్ కి రాజమౌళి కథలు వినిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ రాజమౌళి కి వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు.ఇక రాజమౌళి స్టార్ అయ్యాక మాత్రం … ఇతనితో సినిమాలు చేయాలని స్టార్ హీరోలు ఉత్సాహం చూపించారు. కానీ రాజమౌళి మాత్రం ఆ స్టార్ హీరోల జోలికి పోలేదు.

దీనికి రాజమౌళి కి ఎక్కువయ్యింది అంటూ చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేసినవాళ్లు ఉన్నారు. అయితే రాజమౌళి ఇన్నర్ ఒపీనియన్ వేరు.’ నేను సినిమా చేస్తే హీరోని ఎక్కువ సేపు వెయిట్ చేయిస్తాను, హీరోని మరో ప్రాజెక్ట్ వైపు వెళ్లనివ్వను. అంతే కాకుండా హీరోని ముప్పు తిప్పలు పెట్టేసాను. ఎక్కువ ఎండలో,వాన లో నిలబెట్టేస్తాను. అన్నిటికీ మించి నేను పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నాను అంటే వాళ్ళ ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టేసుకుంటారు.

అవి నా మైండ్లో ఉంటే టెన్షన్ పడిపోతాను.పైగా అప్డేట్ లు అంటూ ప్రాణాలు తీసేస్తారు. అందుకే నేను పెద్ద హీరోల జోలికి పోలేను అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. అయితే త్వరలో రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నాడు. ఓ స్టార్ హీరోతో రాజమౌళి చేస్తున్న మొదటి చిత్రం ఇది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus