రెంటికీ చెడ్డ రేవడి కాకుండా చూసుకోండి బాస్‌

టీవీ సీరియల్స్‌లో మాస్‌ హీరో అంటే… ఠక్కున గుర్తొచ్చే పేరు ఆర్కే నాయుడు. ‘మొగలి రేకులు’ సీరియల్‌లో సాగర్‌ పోషించిన పాత్ర… ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సినిమాల తలపించిన హీరోయిజం ఆ క్యారెక్టర్‌లో ఉంటుంది. ‘చక్రవాకం’తో బుల్లితెరపై మెరిసినా.. ‘మొగలి రేకులు’ ఫేమ్‌ తెచ్చింది. అయితే అనూహ్యంగా ఆ సీరియల్‌ తర్వాత సాగర్‌ బుల్లితెరపై కనిపించలేదు. ఆ మధ్య ‘సిద్ధార్థ’ అనే సినిమా చేశారు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ‘షాదీ ముబారక్‌’తో థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ సందర్భంగా తను సీరియళ్లలో ఎందుకు నటించడం లేదో చెప్పుకొచ్చాడు సాగర్‌.

‘‘సీరియళ్లలో నాకు మంచి స్టార్‌డమ్‌ ఉంది. వాటిలో ఒక రేంజ్‌ పాత్రలే చేశాను. అలా చేసుకుంటూ వెళ్తే తర్వాత చేయడానికి అంత స్థాయిలో పాత్రలు దొరకపోవచ్చు. అందుకే సీరియల్స్‌ మానేసి సినిమాల పైనే దృష్టి పెట్టాను. తొలి ప్రయత్నంగా చేసిన ‘సిద్ధార్థ’లో సీరియల్‌ తరహా క్యారెక్టరే చేశాను. దీంతో అనుకున్న ఫలితం దక్కలేదు. అందుకే కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో ‘షాదీ ముబారక్‌’ చేశాను. ప్రస్తుతం అయితే సీరియల్స్‌లో నటించే ఉద్దేశం లేదు. దృష్టంతా సినిమాలపైనే ఉంది’’ అని చెప్పుకొచ్చాడు సాగర్‌.

టీవీలు వద్దనుకుని, సినిమాలకు వచ్చేయడం బాగుంది కానీ… ఇక్కడ సరైన ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేయకపోతే కొనసాగడం కష్టం. తొలి రెండు సినిమాలు ‘సిద్ధార్థ’, ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో మూడో సినిమా మీద గట్టిగానే నమ్మకం పెట్టుకున్నాడు సాగర్‌. ఒకవేళ ఇందులో ఇబ్బందిపడితే.. మళ్లీ బ్యాక్‌టు సీరియల్స్‌ అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి… ఆల్‌ది బెస్ట్‌ సాగర్‌.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus