Venkatesh: అందుకే వెంకీ సినిమాలు ఓటిటికి వెళ్తున్నాయా?

డిస్ట్రిబ్యూటర్లు ఎంత గొడవ పెట్టినా.. కామ్ గా తన పని పూర్తిచేశారు బడా నిర్మాత సురేష్ బాబు. కొద్దిరోజులుగా ప్రచారం జరిగినట్టుగా ‘నారప్ప’ ఓటిటిలోనే విడుదల కాబోతుంది. ఇది మాత్రమే కాదు సురేష్ బాబు నిర్మించిన మరో చిత్రం ‘దృశ్యం2’ కూడా ఓటిటిలోనే విడుదలవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూటర్లు సినిమాని ఎక్కువ రేట్లకు కొనుగోలు చేసే అవకాశం లేదు. మరో పక్క థియేటర్లు తెరుచుకున్నా.. జనాలు వస్తారన్న గ్యారెంటీ అస్సలు లేదు.

ఇవన్నీ పక్కన పెట్టినా థర్డ్ వేవ్ భయం ఎలాగో ఉంది. అంతేకాకుండా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘నారప్ప’ ఔట్పుట్ అంత బాగా రాలేదని కూడా కొందరు చెప్పుకొస్తున్నారు. ‘దృశ్యం2’ పై జనాలకు అంచనాలు లేవు. ఏదేమైనప్పటికీ ‘నారప్ప’ మరియు ‘దృశ్యం2’ లకు కలుపుకుని రూ.76 కోట్లు డీల్ జరిగినట్టు తాజా సమాచారం. ‘నారప్ప’ ని అమెజాన్ ప్రైమ్ వారికి రూ.40 కోట్లకు అమ్మేసారట. ఇంకా శాటిలైట్ రైట్స్ బిజినెస్ మిగిలే ఉంది.

ఇక ‘దృశ్యం2’ డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ ను డిస్ని ప్లస్ హాట్ స్టార్ వారికి రూ.36 కోట్లకు పైనే అమ్మినట్టు తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు థియేటర్లలో విడుదలైనా ఇంత పెద్ద మొత్తం లాభాలు వస్తాయని చెప్పలేము.అంతేకాకుండా ‘జనాల ప్రాణాలను పణంగా పెట్టడం కూడా ఇష్టం లేదని’ సురేష్ బాబు డిస్ట్రిబ్యూటర్లతో చెప్పినట్టు ఇన్సైడ్ టాక్. ఇక ‘నారప్ప’ అయితే జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ‘దృశ్యం2’ ఎప్పుడొస్తుంది అనేది ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించలేదు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus