పూరి జగన్నాథ్ తొలి సినిమా అనగానే ‘బద్రి’ అనే సమాధానం ఇస్తుంటారు. నిజానికి పూరి తొలి సినిమా అది కాదు తెలుసా? అంతేకాదు పూరి డైరక్ట్ చేసిన తొలి హీరో సూపర్‌స్టార్ కృష్ణ అని తెలుసా? ఏంటి ఆశ్చర్యపోతున్నారా? మేం చెప్పేది నిజం. కావాలంటే ఈ వార్త పూర్తిగా చదవండి మీకే క్లారిటీ వస్తుంది. ‘బద్రి’కి ముందు పూరి జగన్నాథ్ కృష్ణతో ‘థిల్లానా’ అనే సినిమా స్టార్ట్ చేసి.. కొన్నాళ్లకు ఆపేశారు. పూరి జగన్నాథ్ టీవీల్లో దర్శకుడిగా చేస్తున్న రోజుల్లో ఆయన పనితనం నచ్చి ఐబీకే మోహన్ ఆయన్ను సంప్రదించారట.
ఆ తర్వాత ఈ ఇద్దరూ కలసి కృష్ణను కలసి ‘థిల్లానా’ అనే కథను ఒప్పించి స్టార్ట్ చేశారు. సినిమా 1996 ఆఖరులో ప్రారంభించి… కొన్నాళ్లు షూటింగ్ చేశారు. అయితే ఆర్థిక కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. మళ్లీ కొన్నాళ్లకు మొదలైనా… తిరిగి ఆగిపోయింది. దీంతో కృష్ణ – పూరి కలసి ఆ సినిమాను ఇక ముందుకు తీసుకెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఇదీ కృష్ణ – పూరి సినిమా సంగతి. ఆ తర్వాత పూరి తన ప్రయత్నాలు తిరిగి మొదలెట్టి పవన్ కళ్యాణ్‌తో ‘బద్రి’ చేసి హిట్ కొట్టారు.
పూరి మార్కు కథతోనే ‘థిల్లానా’ అప్పుడు ఓకే అయ్యిందట. ఫుల్ కామెడీ ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారట పూరి. దాని కోసం అప్పటి స్టార్ కమెడియన్లు మొత్తం సినిమాలో ఉండేలా చూసుకున్నారు కూడా. ఒకవేళ పూరి – కృష్ణ కాంబోలో సినిమా వచ్చుంటే ఎలా ఉండేదో కదా.
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!