తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అఖండ మూవీ ప్రేక్షకులను అంచనాలను మించి ఆకట్టుకుంది. 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం ద్వారా ఈ సినిమా వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించగా రెండు పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించి మెప్పించారు. అఘోర రోల్ లో బాలయ్య నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అయితే ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన తర్వాత హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేస్తే బాగుండేదని కామెంట్లు వినిపించాయి.
అయితే ఈ నెల 20వ తేదీన అఖండ హిందీ వెర్షన్ విడుదలైంది. పెద్దగా ప్రమోషన్స్ లేకుండా హిందీలో విడుదలైన అఖండ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చినా తొలిరోజు కేవలం 50 లక్షల రూపాయల కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో హిందీలో బాలయ్య మార్కెట్ పెరుగుతుందని భావించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. బాలయ్య పాత్రలకు డబ్బింగ్ ఆశించిన రేంజ్ లో లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది.
షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ మేనియా కూడా అఖండ మూవీ హిందీలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోకపోవడానికి కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి. అఖండ తెలుగు వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉండటం ఈ సినిమాకు మైనస్ అయింది. వీరసింహారెడ్డితో తెలుగులో మరో హిట్ ను సొంతం చేసుకున్న బాలకృష్ణ అఖండ హిందీ వెర్షన్ తో మాత్రం అంచనాలను అందుకోలేకపోయారు.
అఖండ టీమ్ హిందీలో ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమా ఫలితం మరింత బెటర్ గా ఉండేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య తన సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ చేయాలని కొంతమంది ఫ్యాన్స్ సూచిస్తున్నారు.