టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఇండస్ట్రీ హిట్లలో అల వైకుంఠపురములో ఒకటి. ఈ సినిమా ఏకంగా 160 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కథ మరీ కొత్తగా లేకపోయినా బన్నీ నటన, త్రివిక్రమ్ డైరెక్షన్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. బుల్లితెరపై రేటింగ్స్ విషయంలో కూడా అల వైకుంఠపురములో సినిమా సంచలనాలను సృష్టించడం గమనార్హం. అయితే అల వైకుంఠపురములో రీమేక్ షెహజాదా హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అందరూ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.
ఈ సినిమా హిందీలో డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తొలిరోజు ఆక్యుపెన్సీ 13 శాతంగా ఉందని తెలుస్తోంది. అల వైకుంఠపురములో సినిమా రీమేక్ హిందీ ప్రేక్షకులకు కనెక్స్ట్ అయ్యే కథాంశంతో తెరకెక్కలేదు. అల వైకుంఠపురములో రిలీజైన మూడేళ్ల తర్వాత రిలీజ్ కావడం ఈ సినిమాకు మైనస్ అయింది. అల వైకుంఠపురములో సినిమాలో పెద్దగా మార్పులు చేయకుండానే హిందీలో షెహజాదా సినిమాను రిలీజ్ చేయడం మైనస్ అవుతోంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ వస్తుంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ నష్టాలను మిగిల్చే సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. బన్నీ యాక్టింగ్ కు కార్తీక్ ఆర్యన్ యాక్టింగ్ కు పొంతనే లేదని బన్నీని మ్యాచ్ చేయలేకపోవడం వల్లే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలుగు సినిమాలను రీమేక్ చేయాలనుకునే హిందీ నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
షెహజాదా డిజాస్టర్ రిజల్ట్ గురించి మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. టాలీవుడ్ సినిమాలకు హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండగా టాలీవుడ్ రీమేక్ సినిమాలను మాత్రం హిందీ ప్రేక్షకులు ఆదరించడం లేదు.