Ante Sundaraniki: ఆ విషయంలో న్యాచురల్ స్టార్ మారక తప్పదా?

నాని, నజ్రియా హీరోహీరోయిన్లుగా నటించిన అంటే సుందరానికి సినిమా వీకెండ్ వరకు బాగానే కలెక్షన్లను సాధించినా వీకెండ్ తర్వాత కలెక్షన్లు భారీస్థాయిలో తగ్గాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఫుల్ రన్ లో భారీ నష్టాలు రావడం గ్యారంటీ అని తేలిపోయింది. నిర్మాతలు బాగానే ప్రమోషన్స్ చేసినా ఈ సినిమాకు ప్లస్ కాలేదు. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కారణమేంటనే ప్రశ్నకు వేర్వేరు జవాబులు వినిపిస్తున్నాయి. నజ్రియాను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేయడం సినిమాకు మైనస్ అయిందని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

నాని, నజ్రియా కాంబినేషన్ సీన్లు ఆకట్టుకునేలా లేకపోవడం సినిమాకు మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు వివేక్ ఆత్రేయ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా చాలా సీన్లను తెరకెక్కించడం కూడా ఈ సినిమాకు మైనస్ అయిందని చెప్పవచ్చు. మరోవైపు నాని అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని సినిమాలను ఎంపిక చేసుకుంటే బాగుంటుందని క్లాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని సినిమాలను ఎంపిక చేసుకుంటే మాత్రం నష్టపోక తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నాని ఇకనైనా ఈ విషయంలో మారతారో లేదో చూడాల్సి ఉంది. నాని టాలెంట్ ఉన్న దర్శకులకు అవకాశాలు ఇస్తున్నా తనకు సూట్ అయ్యే కథలను ఎంచుకోవడంలో ఫెయిలవుతుతున్నారు. ఈ మధ్య కాలంలో శ్యామ్ సింగరాయ్ మినహా మిగిలిన సినిమాల్లో నాని హీరోయిన్ల ఎంపిక కూడా బాలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో ఆయన భవిష్యత్తు సినిమాలపై ఎఫెక్ట్ పడుతోంది.

నాని గత సినిమా శ్యామ్ సింగరాయ్ కూడా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. నాని తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒక్కో సినిమాకు నాని ప్రస్తుతం 12 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus