Balakrishna: కంగారు పడుతున్న బాలయ్య ఫ్యాన్స్.. కారణమిదే?

స్టార్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈ ఏడాది మే నెల 28వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత ఇతర స్టార్ హీరోల సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించిన ప్రకటనలు వెలువడినా అఖండ రిలీజ్ గురించి మాత్రం స్పష్టత రాలేదు. మొదట దసరాకు ఆ తర్వాత దీపావళికి అఖండ రిలీజ్ కానుందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రస్తుతం డిసెంబర్ 2వ తేదీన అఖండ రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ డేట్ గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకు తమకు టెన్షన్ తప్పదని బాలయ్య అభిమానులు చెబుతున్నారు. ఈ ఏడాది రిలీజ్ కావాల్సిన ఆచార్య, ఖిలాడీ, ఎఫ్3 సినిమాలు వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇతర స్టార్ హీరోలు షాక్ ఇచ్చిన విధంగా బాలయ్య కూడా అభిమానులకు షాక్ ఇస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అఖండ కూడా వచ్చే ఏడాదికి వాయిదా పడుతుందేమోనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అఖండ రిలీజ్ డేట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. బాలయ్య అఖండతో రికార్డు స్థాయిలో షేర్ కలెక్షన్లను సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఖర్చుకు వెనుకాడకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు 90 కోట్ల రూపాయలు ఖర్చైందని తెలుస్తోంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus