ఎన్టీఆర్30 ఈవెంట్ లో బాలీవుడ్ నిర్మాత అందుకే కనిపించారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరగగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు. హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కూడా పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. టీ సిరీస్ భూషణ్ కుమార్ సైతం సందడి చేశారు.

భూషణ్ కుమార్ హిందీలో ఈ సినిమాను విడుదల చేయనున్నారని సమాచారం అందుతోంది. ఆయన ఈ సినిమాలో పెట్టుబడులు కూడా పెడుతున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. సోలో హీరోగా తారక్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదేననే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ విలన్స్ కు చుక్కలు చూపించే పాత్రలో కనిపించనున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. ఈ సినిమా పాటలు స్పెషల్ గా ఉండేలా అనిరుధ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా.

సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కు విలన్ గా నటించాలని ఉందని విశ్వక్ సేన్ చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ అని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్, విశ్వక్ సేన్ కాంబినేషన్ లో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus