Jr NTR: తారక్ నాని మధ్య విభేదాలకు రీజన్లు ఇవేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ప్రస్తుతం తారక్ ఒక యాడ్ షూటింగ్ లో పాల్గొంటుండగా 2023 సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి తారక్ కొరటాల కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కొరటాల శివ మైథలాజికల్ టచ్ ఉన్న కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. దర్శకుడు కొరటాల శివకు జూనియర్ ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారని సమాచారం అందుతోంది.

2023 దసరా టార్గెట్ గా ఈ సినిమా షూట్ జరగనుందని బోగట్టా. మరోవైపు ఈ మధ్య కాలంలో తారక్ కొడాలి నాని కలిసి కనిపించడం లేదనే సంగతి తెలిసిందే. తారక్ కొడాలి నాని విడిపోవడానికి కారణమేంటనే ప్రశ్నకు చాలామంది దగ్గర సమాధానం లేదు. కొడాలి నాని తారక్ తో పలు సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ దర్శకులలో ఒకరైన వీవీ వినాయక్ తారక్ కొడాలి నాని విడిపోవడానికి సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కొడాలి నాని వైసీపీలో చేరడం వల్లే తారక్ కొడాలి నాని విడిపోయి ఉండవచ్చని వినాయక్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకప్పుడు మంచి స్నేహితులు అయిన తారక్ కొడాలి నాని మధ్య ప్రస్తుతం గ్యాప్ ఉందని వినాయక్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో తారక్ కూడా కొడాలి నానితో తనకు ఉన్న సమస్యల గురించి వెల్లడించే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

తారక్ కొడాలి నాని కలిస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మరోవైపు తారక్ కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ త్వరలో రానున్నాయని తెలుస్తోంది. తారక్ నవ్యత ఉన్న కథలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus