Rajamouli: ఆ ఆలోచనలకు రాజమౌళి దూరంగా ఉన్నారా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఏప్రిల్ నెల 28వ తేదీన రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి మహేష్ సినిమా స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారని కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే వైరల్ అయిన వార్తలలో ఏ మాత్రం నిజం లేదని సమాచారం. ప్రస్తుతం రాజమౌళి సినిమాలకు సంబంధించిన పనులకు, ఆలోచనలకు దూరంగా ఉన్నారని బోగట్టా. ఖాళీ సమయంలో రాజమౌళి వెబ్ సిరీస్ లను చూడటంతో పాటు నవలలు, బుక్స్ చదువుతున్నారని సమాచారం.

తన భవిష్యత్తు సినిమాల కథలకు సంబంధించిన చర్చల్లో పాల్గొనడానికి కూడా జక్కన్న ఆసక్తి చూపడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాతే రాజమౌళి కొత్త సినిమా పనులతో బిజీ కానున్నారని జక్కన్న మౌనం వెనుక అసలు సీక్రెట్ మాత్రం ఇదేనని తెలుస్తోంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు కొన్నిరోజుల ముందే ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని చిత్రయూనిట్ భావిస్తోంది. మళ్లీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మారితే ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్లపై ఆ ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా సమ్మర్ లో ఈ సినిమా విడుదలైతే కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సక్సెస్ సాధిస్తే చరణ్, ఎన్టీఆర్ లకు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు దక్కే ఛాన్స్ ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత నటించే ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కేలా ఈ హీరోలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బన్నీ, ప్రభాస్ ఇప్పటికే బాలీవుడ్ లో మంచి గుర్తింపును సొంతం చేసుకోగా చరణ్, ఎన్టీఆర్ కూడా హీరోలుగా తమ క్రేజ్ ను పెంచుకుంటారేమో చూడాల్సి ఉంది.

బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమాలను ఆదరిస్తున్నారు. టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus