Manchu Vishnu: ఆ రీజన్ వల్లే జిన్నా సినిమాను వాయిదా వేశారా?

మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన జిన్నా సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని మంచు విష్ణు ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటారని చాలామంది భావిస్తున్నారు. ఇషాన్ సూర్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదట దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రచారం జరిగింది.

అయితే ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా ఈ సినిమాలో నటించడం గమనార్హం. అక్టోబర్ 5వ తేదీన గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యం సినిమాలు థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగగా ఈ మూడు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలకు పోటీగా జిన్నా సినిమా విడుదలైతే జిన్నా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో నష్టపోక తప్పదు. ఈ కారణం వల్లే జిన్నా మేకర్స్ సినిమా వాయిదాకు ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 21వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. జిన్నా వాయిదా గురించి సోషల్ మీడియా, వెబ్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుండగా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మంచు విష్ణు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వేగంగా సినిమాలు చేయడం కంటే కచ్చితంగా సక్సెస్ సాధించేలా విష్ణు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాసినిమాకు విష్ణు రేంజ్ పెరుగుతుండగా ఈ ప్రాజెక్ట్ విషయంలో విష్ణు కాన్ఫిడెన్స్ తో ఉన్నారని తెలుస్తోంది.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus