నటుడిగా, దర్శకుడిగా, సినీ విమర్శకుడిగా కత్తి మహేష్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. సినిమాలపై అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో పాటు పలు వివాదాల ద్వారా కత్తి మహేష్ నిత్యం వార్తల్లో నిలిచారు. రెండు వారాల క్రితం కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కత్తి మహేష్ ప్రాణాలను కాపాడటానికి వైద్యులు ఎంతో కృషి చేసినా ఫలితం దక్కలేదు. మొదట కోలుకున్నట్టే కనిపించిన కత్తి మహేష్ ఆరోగ్యం విషమించడంతో మరణించారు.
కత్తి మహేష్ మృతిని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రికి తరలించిన తరువాత వైద్యులు కత్తి మహేష్ ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, ఇతర సమస్యలను గుర్తించి చికిత్సను ప్రారంభించారు. అయితే వైద్యుల చికిత్సకు కోలుకోని మహేష్ శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కడితే శరీరంలోని అవయవాలకు రక్త సరఫరా ఆగిపోతుంది. రక్త నాళాలు స్తంభించడం వల్ల కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. ఊపిరితిత్తుల సమస్య వల్లే కత్తి మహేష్ మృతి చెందారని తెలుస్తోంది.
కత్తి మహేష్ సన్నిహితులు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినీ ప్రముఖులు కత్తి మహేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని దిగువపల్లెలో కత్తి మహేష్ అంత్యక్రియలు జరగనున్నాయి. కత్తి మహేష్ భార్య సోనాలి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాగా వీరికి ముకుంద అనే కొడుకు ఉన్నారు. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు తదితర సినిమాల్లో కత్తి మహేష్ నటించారు.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!