Nagarjuna: ఆ కారణం వల్లే ఏజెంట్ విషయంలో నాగ్ జోక్యం చేసుకోవడం లేదా?

ఈ వారం థియేటర్లలో విడుదలైన విరూపాక్ష సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సుకుమార్ స్క్రీన్ ప్లేతో విడుదలైన ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి మంచి రేటింగ్స్ వచ్చాయి. క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడం గమనార్హం. వచ్చే వారం విడుదలవుతున్న ఏజెంట్ సినిమా కూడా సక్సెస్ సాధించి ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెరిగినా నాగార్జున ఈ సినిమా గురించి పట్టించుకోకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.

గత కొన్ని నెలలుగా నాగార్జున (Nagarjuna) షూటింగ్ లకు సైతం దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అఖిల్ కు సంబంధించి తాను జోక్యం చేసుకున్న కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో నాగ్ ఈ నిర్ణయం తీసుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు ఏజెంట్ సినిమా బడ్జెట్ హద్దులు దాటిన నేపథ్యంలో ఈ మూవీ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ దర్శకునికి మరో హిట్ అందిస్తుందో లేదో చూడాలి.

వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ అందించగా ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రం ఏజెంట్ ట్రైలర్ బాగా నచ్చింది. రెండేళ్లకు పైగా షూట్ జరుపుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమాతో అఖిల్ కోరుకున్న భారీ విజయం దక్కాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి వైద్య ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం కానుండగా ఈ సినిమా ఆమెకు కచ్చితంగా మంచి పేరును తెచ్చిపెడుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే అఖిల్ రెమ్యునరేషన్ సైతం పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కెరీర్ విషయంలో అఖిల్ ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus