మెగా కోడలు ఉపాసన గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవ సరం లేదు. ఉపసాన సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా ఉపాసన ఇంట్లో చిన జీయర్ స్వామి వేద పాఠశాల విద్యార్థులు ఉండగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఉపాసన ఇంట్లో వేద పాఠశాల విద్యార్థులు కనిపించడానికి రీజన్ ఏంటనే చర్చ జరిగింది. ఉపాసన చరణ్ ల గారాలపట్టి క్లీంకారాను వేదమంత్రాలతో ఆశీర్వదించడానికి వాళ్లు ఉపాసన ఇంటికి హాజరైనట్టు తెలుస్తోంది.
వినాయక చవితి రోజున వేద పాఠశాల విద్యార్థులు ఇంటికి హాజరై వేద మంత్రాలను పఠించడంతో ఉపాసన (Upasana) వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది జరుపుకున్న వినాయక చవితి పండుగ మెగా కుటుంబానికి మరింత స్పెషల్ అనే సంగతి తెలిసిందే. క్లీంకారా పుట్టిన తర్వాత వచ్చిన పండుగ కావడంతో ఈ పండుగను మెగా ఫ్యామిలీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. 2024 సంవత్సరం మెగా ఫ్యామిలీకి మరింత కలిసిరావాలని నెటిజన్లు ఫీలవుతున్నారు.
చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. 350 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. కియారా అద్వానీ, అంజలి గేమ్ ఛేంజర్ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమాకు చరణ్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారు. చరణ్ రేంజ్ ను ఈ సినిమా మరింత పెంచుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.