Ram Charan: గౌతమ్ మూవీకి చరణ్ నో చెప్పడం వెనుక రీజన్ ఇదేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో గౌతమ్ తిన్ననూరి ఒకరు. గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ గా తెరకెక్కిన మళ్లీరావా, జెర్సీ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి. అయితే జెర్సీ హిందీ రీమేక్ మాత్రం గౌతమ్ తిన్ననూరికి షాకిచ్చింది. అయితే జెర్సీ హిందీ రీమేక్ రిలీజ్ కు ముందే చరణ్ గౌతమ్ తిన్ననూరి కాంబోలో మూవీ ఫిక్స్ అయినా ఈ సినిమా ఆగిపోయిందని అధికారిక ప్రకటన వెలువడింది.

అయితే గౌతమ్ తిన్ననూరి సినిమాలో హీరో పోలీస్ పాత్రలో కనిపించాల్సి ఉందని ఆ రీజన్ వల్లే చరణ్ ఈ సినిమాకు నో చెప్పారని బోగట్టా. చరణ్ ఇప్పటికే పలు సినిమాలలో పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. గౌతమ్ మూవీలో మళ్లీ పోలీస్ గా నటిస్తే గత సినిమాలలోని పోలీస్ పాత్రలను మించి మెప్పించడం కష్టమని భావించారని తెలుస్తోంది. ఈ రీజన్ వల్లే చరణ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.

చరణ్ ఈ కథను రిజెక్ట్ చేసినా విజయ్ దేవరకొండ మాత్రం ఈ సినిమాలో హీరోగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. లైగర్ సినిమా రిజల్ట్ విజయ్ దేవరకొండను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తుండగా సమంత వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోంది. గౌతమ్ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.

విజయ్ దేవరకొండ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తుండగా విజయ్ గౌతమ్ కాంబో మూవీ రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయ్ ఒక్కో సినిమాకు పది కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. విజయ్ దేవరకొండ మల్టీస్టారర్స్ లో నటించాలని కొంతమంది అభిమానులు సూచనలు చేస్తుండటం గమనార్హం.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus