Chiranjeevi: చిరంజీవి శైలేష్ కొలను కాంబోలో సినిమా రాకపోవడానికి కారణాలివేనా?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవి యంగ్ డైరెక్టర్లను ప్రోత్సహించే విషయంలో ముందువరసలో ఉంటారు. చిరంజీవి శైలేష్ కొలను కాంబోలో సినిమా వస్తుందని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సైంధవ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శైలేష్ కొలను ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. చిరంజీవి సినిమా ఆఫర్ ను నేను రిజెక్ట్ చేయలేదని ఆయన అన్నారు.

చిరంజీవి సినిమా డైరెక్షన్ ఛాన్స్ కు నో చెప్పేంత పెద్దవాడిని కాదని ఆయన అన్నారు. అప్పట్లో ఒక సినిమాకు సంబంధించి చర్చ జరిగిందని ఆ సినిమా నేను నో చెప్పేంత వరకు కూడా వెళ్లలేదని శైలేష్ కొలను కామెంట్లు చేశారు. అయితే ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదని అంత మాత్రాన ఆ సినిమా ఆఫర్ ను నేను రిజెక్ట్ చేసినట్టు కాదని శైలేష్ కొలను పేర్కొన్నారు. నా కథలను మాత్రమే నేను తీస్తానని ఆయన అన్నారు.

ఇతరుల కథతో సినిమా తీయాల్సిన పరిస్థితి రావడం వల్లే చిరంజీవి సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని అంతకు మించి ఆ సినిమాను వదులుకోవడానికి మరో కారణం లేదని ఆయన అన్నారు. చిరంజీవితో పని చేయాలని చాలా కోరిక ఉందని చిన్నప్పట్నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని శైలేష్ కొలను కామెంట్లు చేశారు. చిరంజీవి నా మనస్సుకు చాలా దగ్గరైన వ్యక్తి అని శైలేష్ కొలను పేర్కొన్నారు.

చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వస్తే ఆయనను ఎలా చూపించాలో ఇప్పటికే విజన్ ఉందని కాకపోతే దానికి చాలా సమయం పడుతుందని తెలిపారు. ఆ టైమ్ వచ్చినప్పుడు కచ్చితంగా చిరంజీవి ఇంటి తలుపు తట్టి ఆయనకు కథ చెబుతానని శైలేష్ కొలను కామెంట్లు చేశారు. చిరంజీవి శైలేష్ కొలను కాంబోలో భవిష్యత్తులో సినిమా వచ్చే ఛాన్స్ అయితే ఉండగా ఆ సినిమా ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus