Shriya: ప్రమోషన్స్ లో శ్రియ మిస్.. కారణమిదేనా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ పై ఇప్పటికే ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లను వేర్వేరు నగరాలలో నిర్వహించి ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాలని మేకర్స్ అనుకుంటున్నారు. చరణ్, ఎన్టీఆర్ ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటూ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తమ శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని మేకర్స్ అనుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

అయితే సీనియర్ హీరోయిన్ శ్రియ మాత్రం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో కనిపించడం లేదు. ఈ సినిమా ప్రమోషన్స్ లో శ్రియ పాల్గొంటే ఆమె కెరీర్ కు కూడా ప్లస్ అవుతుంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో శ్రియ రోల్ చిన్న రోల్ కావడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మేకర్స్ శ్రియను పిలవలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మాత్రం శ్రియ పాల్గొననున్నారని ప్రచారం జరుగుతోంది. శ్రియ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడంతో ఆమె ఫ్యాన్స్ కూడా బాధ పడుతున్నారు.

ఆర్ఆర్ఆర్ సక్సెస్ సాధిస్తే శ్రియ కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. బాహుబలి సిరీస్ తర్వాత రమ్యకృష్ణకు ఆఫర్లు పెరగగా ఆర్ఆర్ఆర్ తర్వాత శ్రియకు కూడా ఆఫర్లు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో శ్రియకు సరైన సక్సెస్ లేదు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఛత్రపతి సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రియ చాలా సంవత్సరాల తర్వాత జక్కన్న డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ లో నటించారు.

అజయ్ దేవగణ్ భార్య పాత్రలో శ్రియ నటించగా ఈ పాత్రకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 39 సంవత్సరాల వయస్సులో కూడా శ్రియ వరుసగా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ ఉండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మూవీ 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. ఆర్ఆర్ఆర్ ఏ స్థాయిలో సక్సెస్ సాధిస్తుందో చూడాల్సి ఉంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus