‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్ తేజ్ కొణిదెల.అతని మొదటి సినిమాకి ఆశించిన రేంజ్లో గుర్తింపు దక్కలేదు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అతని సినిమాను ప్రమోట్ చేసింది లేదు.తర్వాత అతను మెగాస్టార్ చిరంజీవి- రాంచరణ్ లు కలిసి నటించిన ‘ఆచార్య’ చిత్రంలో కూడా ఓ చిన్న పాత్ర పోషించాడు. విలన్ సోనూసూద్ పక్కన ఉంటూ బాధ్యత లేని స్టూడెంట్ గా మిగిలిన స్టూడెంట్స్ ను కూడా చెడగొట్టే నెగిటివ్ పాత్రలో పవన్ తేజ్ కనిపించాడు.
ఓ ఫైట్ లో చిరు చేతిలో తన్నులు తిన్నట్టు కూడా నటించాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందు ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంలో కూడా నటించాడు. ఈ మధ్యనే ఇతనికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ప్రముఖ నటి, యాంకర్ అయిన మేఘనను ఇతను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇదిలా ఉండగా.. పవన్ తేజ్ కు చిరంజీవి ఫ్యామిలీకి ఉన్న బంధుత్వం గురించి చాలా మందికి తెలీదు. ఈ విషయం పై అతను ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. రాంచరణ్ – వరుణ్ తేజ్ లు అన్నదమ్ముల బిడ్డలు అన్న సంగతి తెలిసిందే.
వాళ్ళలానే చిరంజీవి మరియు పవన్ తేజ్ నాన్నగారు కూడా అన్నదమ్ముల బిడ్డలట. ఆ రకంగా చిరు… పవన్ తేజ్ కి బాబాయ్ అవుతారట. తను నటుడు అవ్వాలనుకున్నప్పుడు.. చిరంజీవి వెంటనే ఓకే చెప్పలేదని. ‘మీ బాబాయ్ కి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి.. నువ్వు హీరో అయిపోవచ్చు..
అని ఎవరో నీకు చెప్పుంటారని..ఆ మాటలు పట్టించుకోకుండా నీకు ఏది నచ్చితే అది చెయ్యి’ అంటూ చిరు చెప్పారని పవన్ తేజ్ తెలిపాడు. అయితే ‘హీరో అని కాదు నాకు నటుడిగా ప్రూవ్ చేసుకోవాలని ఉంది’ అని పవన్ తేజ్ చెప్పడంతో చిరు ఎంకరేజ్ చేసినట్టు కూడా పవన్ తేజ్ చెప్పుకొచ్చాడు.