‘గోల్కొండ హైస్కూల్’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు సంతోష్ శోభన్. ఆ తరువాత ‘తను నేను’, ‘పేపర్ బాయ్’ లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు. ప్రస్తుతం ఇతడు నటించిన ‘ఏక్ మినీ కథ’ విడుదలకు సిద్ధమవుతోంది. రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో సంతోష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సంతోష్ తండ్రి శోభన్ టాలీవుడ్ లో దర్శకుడిగా సినిమాలు తీశారు.
ఆయన తెరకెక్కించిన ‘వర్షం’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఆయన మరణం తరువాత చాలా గ్యాప్ ఇచ్చి సంతోష్ నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తన తండ్రితో ఎక్కువ సమయం గడిపే ఛాన్స్ రాలేదని అన్నారు. తన పేరులో కావాలనే తన తండ్రి శోభన్ పేరుని యాడ్ చేసుకున్నానని చెప్పారు. అలానే నటుడు లక్ష్మీపతి తన పెదనాన్న అనే సంగతి చాలా తక్కువమందికి తెలుసనీ.. చిన్నప్పటి నుండి ఇంట్లో సినిమా వాతావరణం ఉన్నప్పటికీ..
తమను సినిమాలకు దూరంగా ఉంచేవారని చెప్పారు. కానీ తన పెదనాన్న నటించిన ‘బాబీ’ సినిమా షూటింగ్ ని చూడడానికి మాత్రం షూటింగ్ సెట్ కి వెళ్లానని చెప్పుకొచ్చారు. లక్ష్మీపతి కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేశారు. దాదాపు డెబ్భైకి పైగా చిత్రాల్లో నటించారాయన. ‘అమ్మాయిలు అబ్బాయిలు’, ‘కితకితలు’ లాంటి సినిమాల్లో ఆయన పెర్ఫార్మన్స్ ను అంత సులువుగా మర్చిపోలేం.