Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో వాటికి కత్తెర..?!

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా పరశురామ్(బుజ్జి)(Parasuram) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్'(Family Star) . ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు  (Dil Raju)  ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు,గ్లింప్స్ టీజర్, ట్రైలర్.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఏప్రిల్ 5 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. పైగా ‘గీత గోవిందం’ (Geetha Govindam)  వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ – పరశురామ్(బుజ్జి) కాంబినేషన్లో రూపొందిన మూవీ ఇది.

ఆ సినిమాలోలానే ఇందులో కూడా ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయని ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్ధమవుతుంది. అయినప్పటికీ కూడా ఈ సినిమాకి సెన్సార్ వారు కొన్ని సీన్స్ కి అభ్యంతరం వ్యక్తం చేసి తొలగించినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. ‘ఫ్యామిలీ స్టార్’ లో పలు చోట్ల మద్యం బాటిల్స్ బ్రాండ్స్ కనబడకుండా వాటి లేబుల్స్ ని సిజితో బ్లర్ చేశారట. అలాగే మరికొన్ని సన్నివేశాల్లో ‘లం*కొడకా’ ‘మాదాచోద్’ ‘ఫ*క్’ ‘ముం*డా’ వంటి అసభ్యకరమైన పదజాలాలు వాడటంతో..

వాటిని కూడా తొలగించినట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండని సినిమాల్లో ఎక్కువగా అగ్రెసివ్ గా చూపిస్తూ ఉంటారు. అతని బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు అక్కడక్కడ బూతులు కూడా తిట్టిస్తూ ఉంటారు దర్శకులు. ఈ సినిమాలో కూడా విజయ్ ని కొన్ని చోట్ల అలా ప్రెజెంట్ చేయగా.. ఫ్యామిలీ సినిమా కాబట్టి .. అవి సెన్సార్ కి బలైనట్టు స్పష్టమవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus