Jr NTR: తారక్ కారు నంబర్ అసలు రహస్యమిదే..?

సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు అనేక సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కారు నంబర్ 9999 అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొత్త కారు కొనుగోలు చేసినా నంబర్ మాత్రం 9999 ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. చాలామంది తారక్ కు కారు నంబర్ సెంటిమెంట్ అని భావించినా ఒక సందర్భంలో ఎన్టీఆర్ ఈ నంబర్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. తనకు సెంటిమెంట్లపై పెద్దగా నమ్మకం ఉండదని అయితే 9 అనే నంబర్ మాత్రం ఎంతో ఇష్టమని ఎన్టీఆర్ అన్నారు.

తాను తాత సీనియర్ ఎన్టీఆర్ ను, నాన్న నందమూరి హరికృష్ణను ఎంతగానో ఆరాధిస్తానని వాళ్ల కారు నంబర్లు 9999 కావడంతో తాను కూడా కారుకు అదే నంబర్ ఉండేలా చూసుకుంటున్నానని ఎన్టీఆర్ వెల్లడించారు. తనకు తెలియకుండానే ఆ కారు నంబర్ పై ఇష్టం పెరిగిందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఈ నెల 10వ తేదీన కరోనా బారిన పడిన తారక్ హోం ఐసోలేషన్ లో ఉంటూ కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే ఎన్టీఆర్ కు కరోనా నెగిటివ్ రావాలని ఆయన ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు.

మరోవైపు ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో నటించనున్నారు. ఎన్టీఆర్ కారు నంబర్ లోనే కాదు ట్విట్టర్ ఖాతాలో కూడా 9999 అనే నంబర్ ఉంటుందనే సంగతి తెలిసిందే. కొరటాల శివ సినిమా తరువాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus