పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇంకా రూ.100 కోట్ల షేర్ మూవీ పడలేదు. కానీ పవన్ సినిమాలకు రూ.100 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అవుతుంది. ఈ విషయంలో బయ్యర్స్ ఎటువంటి సందేహం పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ సినిమాలను భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేస్తుంటారు.సినిమా ఫ్లాపైనా పవన్ ఏదో ఒకరకంగా నష్టపరిహారం చెల్లించేలా చేస్తారు అనేది మరో నమ్మకం. ‘భీమ్లా నాయక్’ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు క్రియేట్ చేసినా ఆ మూవీ చాలా బాగా కలెక్ట్ చేసింది. బ్యాలెన్స్ నష్టాలు పవన్.. మేనేజ్ చేశారు.
సరే అన్నీ ఎలా ఉన్నా.. పవన్ ఉన్నాడు కదా అని ప్రతిసారి కంటెంట్ ను చూసుకోకుండా సినిమాలను భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేసుకోకూడదు. కొంత వరకు అయితే పవన్ మ్యానేజ్ చేస్తారు కానీ.. సగానికి సగం నష్టం వస్తే ఆయన మాత్రం ఏం చేస్తాడు. ఇదంతా.. ఎందుకు చెబుతున్నామంటే.. పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతమ్’ కి ఇది రీమేక్.
ఈ చిత్రానికి ‘బ్రో’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్టు ఈ మధ్యనే ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో పవన్ హీరో కాదు. గెస్ట్ రోల్ కి కాస్త ఎక్కువ అన్నట్టు ఉంటుంది ఆ పాత్ర. పవన్ అభిమానులు ఆశించే ఫైట్స్ వంటివి ఇందులో ఉండవు. అయినా సరే ‘బ్రో’ చిత్రానికి భారీగా బిజినెస్ అవుతుందని టాక్. అందుతున్న సమాచారం ప్రకారం..
‘బ్రో’ (Bro Movie) చిత్రానికి రూ.90 కోట్ల బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. సాయి ధరమ్ తేజ్ మార్కెట్ కేవలం రూ.30 నుండి రూ.40 కోట్లు మాత్రమే ఉంది. కానీ పవన్ ఉన్నాడు కదా అని ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్సే రూ.90 కోట్లు అయిపోతుంది. ఇక నాన్ థియేట్రికల్ అంతా కలుపుకుంటే రూ.100 కోట్లు ఈజీగా దాటేస్తుందన్న మాట.