బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి విజువల్ వండర్ గా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అతి త్వరలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుండగా జక్కన్న మూడు నిమిషాల నిడివితో ట్రైలర్ ను కట్ చేశారని సమాచారం. మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో ఉన్న ఈ ట్రైలర్ లో అద్భుతమైన ఎమోషన్స్ తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఉంటాయని సమాచారం.
ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా, ఆర్ఆర్ఆర్ కథ గురించి ప్రేక్షకులకు అవగాహన కలిగేలా రాజమౌళి ట్రైలర్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. అతి త్వరలో ట్రైలర్ రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం. రాజమౌళి స్ట్రాటజీ ప్రకారం సినిమాపై అంచనాలను ఊహించని స్థాయిలో పెంచాలని మూడు నిమిషాల ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.
అలియా భట్, ఒలీవియా మోరిస్, శ్రియ సరణ్, అజయ్ దేవగణ్, మరి కొందరు ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ హిందీ ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని చరణ్, ఎన్టీఆర్ లకు ప్రభాస్ స్థాయిలో పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు దక్కడం గ్యారంటీ అని తెలుస్తోంది. చరణ్, ఎన్టీఆర్ తమ తర్వాత సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కేలా జాగ్రత్త పడుతున్నారు.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?