కృష్ణ, రమేష్, మహేష్ కాంబోలో వచ్చిన ఆ మూవీ వెనుక అంత కథ ఉందా?

సూపర్ స్టార్ కృష్ణ గారు నిన్న మరణించిన సంగతి తెలిసిందే.ఆయన టాలీవుడ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన వారిలో ఒకరు. సీనియర్ మోస్ట్ స్టార్ హీరోల్లో అయితే టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించింది ఈయనే..! ప్రయోగాలకు పెద్ద పీట వేసి.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. ఇదిలా ఉండగా..కృష్ణ గారి మరణం తర్వాత ఆయన గురించి బోలెడన్ని విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కృష్ణ తన ఇద్ద‌రు కొడుకులు అయిన ర‌మేష్ బాబు, మ‌హేష్ బాబుల‌తో క‌లిసి ‘ముగ్గురు కొడుకులు’ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా 1988 వ సంవత్సరంలో రిలీజ్ అయ్యి సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా వెనుక చిన్న కథ కూడా ఉంది. కృష్ణ గారి తల్లి నాగ‌ర‌త్న‌మ్మ కోరిక మేర‌కు ఈ సినిమా తీసారట. నాగ‌ర‌త్న‌మ్మ గారికి ముగ్గురు కొడుకులు. వారే కృష్ణ‌, హ‌నుమంత‌రావు, ఆది శేష‌గిరిరావు. అందుకే తన ముగ్గురు కొడుకుల‌కు ప్ర‌తీక‌గా ‘ముగ్గురు కొడుకులు’ టైటిల్ తోనే సినిమా రూపొందాలని ఆమె ఆశ పడ్డారు. కృష్ణ‌ గారికి ఈ విషయం చాలా సార్లు చెప్పారు. అమ్మ కోరిక మేరకు తన ఆస్థాన ర‌చ‌యిత‌ అయిన మ‌హార‌థిని పిలిపించుకుని…

‘ముగ్గురు కొడుకులు’ పేరుతో ఓ క‌థ త‌యారు చేయ‌మ‌ని చెప్పారు. అదే టైంలో ‘ముగ్గురు కొడుకులు’ అనే టైటిల్ ను రిజిస్ట‌ర్ చేయించారు. మ‌హార‌థి స్క్రిప్టు రెడీ చేయ‌లేకపోవడంతో ఆమెకు కోపం వచ్చింది. ‘ఒక్క ముక్క కూడా రాయ‌లేదు. ఇలాగైతే సినిమా ఎప్పుడు తీస్తావ్‌’ అంటూ కృష్ణ‌ గారి ముందే మహారథిని గ‌ట్టిగా అడిగారు నాగరత్నమ్మ. దీంతో.. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌ కు బాధ్యతను అప్పగించారు. వాళ్ళు రెడీ చేసిన కథ నాగ‌ర‌త్న‌మ్మ‌కు న‌చ్చ‌లేదు. మొత్తానికి.. పి.సి.రెడ్డి వచ్చి ఓ లైన్ చెప్పారు. అది ఆమెకు నచ్చింది.

దాన్ని క‌థ‌గా డ‌వ‌లెప్ చేయమని చెప్పారు. కథ ఫైనల్ అయ్యింది. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కూడా ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు అందించడం జరిగింది. ఈ సినిమా రమేష్ బాబు, మహేష్ బాబు నటించడం, మరీ ముఖ్యంగా మ‌హేష్ బాబు ఈ చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషించడం జరిగింది. సినిమా విడుద‌లై… సూప‌ర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే..! కానీ 100 రోజుల వేడుక ప్లాన్ చేసుకుంటున్న టైంలో కృష్ణ తల్లి నాగ‌ర‌త్న‌మ్మ గారు క‌న్నుమూశారు. ఈ చిత్రాన్ని పద్మాలయ స్టూడియోస్ పై నాగరత్నమ్మ గారే నిర్మించడం మరో విశేషం.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus