Ravi Teja: హాట్ టాపిక్ గా మారిన రవితేజ లిప్ లాక్..!

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఖిలాడి’ మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో వీరి కాంబినేషన్లో ‘వీర’ అనే మూవీ వచ్చింది. అది డిజాస్టర్ అయ్యింది. అయినా వీరి కాంబినేషన్లో మరో మూవీ వస్తోంది అనగానే అంతా షాక్ అయ్యారు. అయినప్పటికీ ‘రాక్షసుడు’ వంటి హిట్ కొట్టి ఫామ్లో ఉన్నాడు కాబట్టి, రవితేజ కూడా ఓ డైరెక్టర్ కు రెండో ఛాన్స్ ఇస్తే బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమనే సెంటిమెంట్ ఉంది అని భావించి అభిమానులు కొంతమేర ఈ చిత్రం పై ఆశలు పెట్టుకున్నారు.

Click Here To Watch

కానీ నిన్న విడుదలైన ట్రైలర్ మాత్రం సో సో గానే అనిపించింది. అయితే ట్రైలర్ మొత్తానికి హైలెట్ అయ్యింది మాత్రం రవితేజ- మీనాక్షి చౌదరిల లిప్ లాకే..! రవితేజ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో హీరోయిన్లతో రొమాన్స్ చేసాడు కానీ.. లిప్ లాక్ లు వంటి వాటికి అతను దూరంగానే ఉంటూ వచ్చారు. అయితే 54 ఏళ్ళ వయసులో రవితేజ లిప్ లాక్ సన్నివేశంలో కనిపించడంతో ఈ విషయం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయ్యింది.

ఈ లిప్ లాక్ వెనుక చిన్న కహానీ కూడా ఉందట. రవితేజ అనగానే మాస్ ఆడియెన్స్ లో అంచనాలు ఎక్కువగా ఉంటాయి తప్ప.. యూత్ ను ఆకట్టుకోవడంలో అతను కాస్త వెనుకపడి ఉన్నాడు. అందుకోసం కుర్ర హీరోయిన్లకు ఛాన్స్ ఇచ్చి.. రొమాంటిక్ సన్నివేశాలు, లిప్ లాక్ లు వంటివి చేసి ఆకర్షించాలని అతను డిసైడ్ అయినట్టు ఇన్సైడ్ టాక్. ఇది సక్సెస్ అయ్యే ప్లానేనా? అనే అనుమానం చాలా మందిలో ఉంది.

స్టార్ హీరోయిన్లు అయితే ఇందుకు ఓకె చెప్పారు కాబట్టి.. రవితేజ కుర్ర హీరోయిన్లతో ఈ ప్రయోగాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న వరుస సినిమాల్లో చాలా వరకు కుర్ర హీరోయిన్లే నటిస్తున్నారు. మీనాక్షి చౌదరికి కూడా ఇది రెండో సినిమా. మొదటి సినిమా ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాలో నటించింది. ఆ మూవీ పెద్దగా ఆడలేదు.. మరి ‘ఖిలాడి’ కనుక హిట్ అయితే ఆమెకు కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus