Prabhas: రవితేజ హిట్ మూవీని ప్రభాస్ మిస్ చేసుకున్నారా?

స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రాక్, వీరసింహారెడ్డి విజయాలతో దర్శకునిగా తన స్థాయిని పెంచుకున్నారు. మాస్ హీరోలను హ్యాండిల్ చేయగలనని ప్రూవ్ చేసుకున్న ఈ దర్శకుడు ఇకపై మాస్ సినిమాలనే తెరకెక్కించాలని భావిస్తున్నారు. మైత్రీ బ్యానర్ లోనే గోపీచంద్ మలినేని తర్వాత సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. అయితే గతంలోనే గోపీచంద్ మలినేనికి స్టార్ హీరోలతో పని చేసే ఛాన్స్ వచ్చినా కొన్ని రీజన్స్ వల్ల ఆ ఛాన్స్ మిస్సైంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో గోపీచంద్ మలినేని మాట్లాడుతూ డాన్ శీను మూవీ కథ ప్రభాస్ కోసం సిద్ధం చేసిన కథ అని తెలిపారు. తాను ప్రభాస్ కు ఈ సినిమా కథ వినిపించగా కథ నచ్చడంతో ప్రభాస్ కూడా ఈ సినిమా చేస్తానని చెప్పాడని గోపీచంద్ మలినేని కామెంట్లు చేశారు. అయితే అదే సమయంలో ప్రభాస్ హీరోగా ఏక్ నిరంజన్ మూవీ మొదలైందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభాస్ డేట్లు కుదరకపోవడంతో రవితేజతో ఆ సినిమా తీశానని గోపీచంద్ మలినేని అన్నారు.

డాన్ శీను మూవీ కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీను వైట్ల స్టైల్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించింది. గోపీచంద్ మలినేని తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కు సూట్ అయ్యే కథ గోపీచంద్ మలినేని దగ్గర సిద్ధంగా ఉంది. అయితే ఇప్పట్లో పవన్ కళ్యాణ్ డేట్లు దొరకడం సులువైన విషయం కాదు.

మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరోలంతా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేనికి ఛాన్స్ ఇవ్వడానికి చాలామంది హీరోలు ఎదురుచూస్తున్నా డేట్లు కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. ఫ్యాన్స్ ను మెప్పించే ఎలివేషన్ సీన్లతో గోపీచంద్ మలినేని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సినిమా సినిమాకు గోపీచంద్ మలినేని రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus