Prabhas, Kriti: కృతి- ప్రభాస్… అసలు మేటర్ వేరే ఉందట..!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి వార్తలు ఇండియా మొత్తం చర్చనీయాంశం అవుతుంటాయి. ఎందుకంటే ‘బాహుబలి'(సిరీస్) ‘సాహో’ చిత్రాలతో అతను నార్త్ లో కూడా సూపర్ స్టార్ గా ఎదిగాడు. కాబట్టి.. అతని వ్యక్తిగత విషయాల పై బాలీవుడ్ జనాలు ఎక్కవగా ఫోకస్ పెడుతుంటారు. మొన్నటి వరకు అనుష్కతో ప్రభాస్ పెళ్లి ఉంటుందని వార్తలు వచ్చాయి. అనుష్క- ప్రభాస్ లు జంటగా బిల్లా, మిర్చి వంటి హిట్ చిత్రాల్లో నటించారు.

కానీ ఆ టైములో వీళ్ళ పై పెళ్లి వార్తలు మొదలుకాలేదు. కానీ ఎప్పుడైతే బాహుబలితో వీళ్ళిద్దరూ హిందీలో కూడా పాపులర్ అయ్యారో అప్పటి నుండి పెళ్లి వార్తలు ఎక్కువయ్యాయి. కానీ తర్వాత వీళ్ళు ఆ గాసిప్స్ స్పందించి అవి అవాస్తవాలు అని తేల్చడంతో వాటికి ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యాయి. అయితే ఇటీవల ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్.. ప్రభాస్ తో ప్రేమలో ఉంది అంటూ మళ్ళీ వార్తలు వినిపించాయి.

ఇందులో నిజం లేదు అని కృతి సనన్ క్లారిటీ ఇచ్చింది. ఈ రూమర్స్ స్ప్రెడ్ అవ్వడానికి కారణమైన వరుణ్ ధావన్ కూడా అది సరదాగా చేసిన కామెంట్ అని చెప్పి క్లారిటీ ఇచ్చినా.. వెనుక విషయం వేరే ఉన్నట్లు వినికిడి. ప్రభాస్… సూర్యవంశ రాజుల కుటుంబానికి చెందిన వ్యక్తి. మరోపక్క కృతి సనన్.. రాజ్ పుత్ ల వంశానికి చెందిన అమ్మాయి. కాబట్టి.. వీళ్ళ కుటుంబ సభ్యులు వీరి పెళ్లి వార్తలను నిజం చేయాలని ప్రయత్నిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్.

ఇది స్వయంగా ప్రభాస్ సన్నిహిత వర్గం చెప్పిన న్యూస్. అయితే ఇప్పుడు కృతి వయసు 32 ఏళ్లు కాగా.. ప్రభాస్ వయస్సు 43 ఏళ్ళు. సో ఇద్దరికీ 11 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రభాస్ తన సోదరీమణులు(అలాగే కృష్ణంరాజు కూతుర్లు) కోసం కూడా సంబంధాలు చూస్తున్నాడట. అయితే వాళ్ళ అన్నయ్యగా కన్యాదానం చేయాలి అంటే ప్రభాస్ కూడా పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రభాస్ కి ఇప్పుడు పెళ్లి చేయాలనే ఆలోచన కుటుంబ సభ్యులకు ఎక్కువగా ఉందట.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus