Ram Charan: బుచ్చిబాబు సినిమాకి చరణ్ ఆర్డర్ ఏంటంటే.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గతకొద్ది రోజులుగా వస్తున్న వార్తలకు చెక్ పెట్టేశాడు. ట్రిపులార్ లాంటి ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం తర్వాత సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ దర్శకత్వంలో RC 15 చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో న్యూ షెడ్యూల్ స్టార్ట్ అయింది. అయితే RC 16కి డైరెక్టర్ ఎవరనే సస్పెన్స్ మాత్రం కంటిన్యూ అవుతోంది. ఇటీవలే గౌతమ్ తిన్ననూరి సినిమా క్యాన్సిల్ అయిపోయినట్టేనని కన్ఫమ్ అయిపోయింది.

మెగా ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చెర్రీ నెక్ట్స్ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ‘ఉప్పెన’తో ఇండస్ట్రీని షేక్ చేయడమే కాక.. ఫస్ట్ సినిమాతోనే వంద కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా.. మెగా పవర్ స్టార్‌కి యాక్షన్ చెప్పబోతున్నాడు. తన గురువు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఇండస్ట్రీ హిట్ (నాన్ బాహుబలి) ‘రంగస్థలం’ కి అసిస్టెంట్ డైరెెక్టర్‌గా పని చేసిన బుచ్చిబాబు ఇప్పుడు చరణ్ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం.

‘ఉప్పెన’ తర్వాత సెకండ్ సినిమాకి గ్యాప్ వచ్చినప్పటికీ.. యూనివర్సల్ అప్పీల్ ఉన్న పవర్‌ఫుల్ సబ్జెక్ట్ పక్కాగా రెడీ చేశాడట.. RC 16 పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతోంది. చరణ్ హీరోగా రాబోయే మూడో పాన్ ఇండియా మూవీ ఇది.. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తుండగా..

వృద్ధి సినిమాస్‌తో పాటు డైరెక్టర్ సుకుమార్‌కు చెందిన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కూడా భాగస్వామ్యం వహిస్తోంది. నిర్మాతగా మాత్రం వెంకట్ సతీష్ కిలారు పేరే పడుతోంది. కర్టెసీ కోసం మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలను కూడా జతచేశారని సమాచారం.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించనున్నారని టాక్.. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌‌ గురించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus