బాలకృష్ణ, నాగార్జున కాంబోలో సినిమా పట్టాలెక్కుతుందా..?

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతోంది. ఒక హీరో మరో హీరోతో కలిసి నటిస్తూ ఉండటంతో ప్రేక్షకులు కూడా మల్టీస్టారర్ సినిమాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సీనియర్ స్టార్ హీరోలు యంగ్ హీరోలలో కలిసి మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తున్నా సీనియర్ స్టార్ హీరో మరో సీనియర్ స్టార్ హీరోతో కలిసి నటించడం లేదు. చిరంజీవి బాలకృష్ణ, బాలకృష్ణ నాగార్జున, నాగార్జున చిరంజీవి కాంబినేషన్ లో మల్టీస్టారర్ లు తెరకెక్కడం లేదు.

అయితే చాలా సంవత్సరాల క్రితం బాలకృష్ణ నాగార్జున హీరోలుగా ఒక మల్టీస్టారర్ తెరకెక్కుతున్నట్టు జోరుగా ప్రచారం జరగగా కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ పట్టాలెక్కలేదు. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్ లో తెరకెక్కిన గుండమ్మ కథ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలకృష్ణ, నాగార్జున హీరోలుగా రీమేక్ చేయాలనే ప్రయత్నాలు జరిగినా ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. ఆ తరువాత చుప్కే చుప్కే అనే హిందీ సినిమా రీమేక్ లో బాలకృష్ణ నాగార్జున నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. బాలకృష్ణ ఈ రీమేక్ ప్రతిపాదన పెట్టగా నాగార్జునకు ఈ సినిమా ఎంతగానో నచ్చింది.

అయితే చుప్కే చుప్కే కథ నచ్చినా హీరోలుగా బాలకృష్ణ, నాగార్జున వేర్వేరు ప్రాజెక్టులతో బిజీ కావడంతో ఈ సినిమా పట్టలెక్కలేదని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కుతుందేమో చూడాలి. ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్, నందమూరి ఫ్యామిలీకి చెందిన ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా పట్టాలెక్కుతోంది. దర్శకధీరుడు రాజమౌళి అద్భుతమైన కథను సిద్ధం చేయడంతో ఈ కాంబినేషన్ పట్టాలెక్కింది. రచయితలు, దర్శకులు అద్భుతమైన కథలను సిద్ధం చేస్తే భవిష్యత్ లో ఒక సీనియర్ స్టార్ హీరో మరో సీనియర్ స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశం ఉంది.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus