Kalyan Ram: బింబిసార మూవీ సక్సెస్ కు అసలు కారణం అతనేనా?

కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మూవీ థియేటర్లలో విడుదలై ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. తొలిరోజు ఈ సినిమా కలెక్షన్లు భారీగానే ఉండవచ్చని తెలుస్తోంది. 16 కోట్ల రూపాయల టార్గెట్ తో విడుదలైన ఈ సినిమా సులువుగానే ఆ టార్గెట్ ను బ్రేక్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ భారీ బడ్జెట్ సినిమా సక్సెస్ కు అసలు కారణం ఎవరనే ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ పేరు సమాధానంగా వినిపిస్తోంది.

కథల విషయంలో తారక్ జడ్జిమెంట్ కు తిరుగుండదని ఈ సినిమా సక్సెస్ తో మరోసారి ప్రూవ్ అయింది. ఈ సినిమా కథ విని ఓకే చేసిన వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్లే కళ్యాణ్ రామ్ బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ చెప్పిన మాటలు అక్షరాలా నిజం కావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా వరుస సక్సెస్ లను సొంతం చేసుకుంటున్న తారక్ కళ్యాణ్ రామ్ కు కూడా సక్సెస్ దక్కడానికి కారణమయ్యారు. భవిష్యత్తులో కూడా కళ్యాణ్ రామ్ కథల విషయంలో, దర్శకుల ఎంపిక విషయంలో తారక్ సహాయం తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బింబిసార పార్ట్1 సక్సెస్ సాధించడంతో బింబిసార పార్ట్2 కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి.

సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సెలబ్రిటీలు బింబిసార సినిమాకు పాజిటివ్ గా పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులు సైతం సినిమాకు హెల్ప్ అవుతాయనడంలో సందేహం అవసరం లేదు. బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నందమూరి హీరోలు వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ ఉండటం అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus