Chandra Mohan: ఆ కారణాలతో తన పిల్లలను ఇండస్ట్రీకి దూరం చేసిన చంద్రమోహన్..!

చంద్రమోహన్ … తెలుగు సినిమా స్వర్ణ యుగంలోనూ .. ఇప్పుడు ఈ కంప్యూటర్ కాలంలోనూ ఏకధాటిగా నటిస్తున్న వారిలో ఆయన కూడా ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రస్థానం మొదలుపెట్టిన చంద్రమోహన్ తర్వాత హీరోగా, కమెడియన్‌గా, విలన్‌గానూ ప్రేక్షకులను మెప్పించారు. దాదాపు 900కు పైగా చిత్రాల్లో నటించారాయన.. ఇందులో 175 సినిమాల్లో చంద్రమోహనే హీరో కావడం విశేషం. అంతేకాదు ఆయన పక్కనే హీరోయిన్ గా చేస్తే వాళ్లు స్టార్లు కావడం పక్కా అనే నమ్మకం ఇండస్ట్రీలో వుండేది.

అందుకు తగ్గట్టుగానే జయప్రద, జయసుధ, శ్రీదేవి తదితరులు స్టార్లుగా మారిన సంగతి తెలిసిందే. అయితే సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసే వాళ్లే తమ పిల్లలను స్టార్లు చేయాలని భావిస్తున్న ఈ రోజుల్లో అంతటి స్టార్ డమ్, పేరు ప్రఖ్యాతులు, మంచి పలుకుబడి వున్న చంద్రమోహన్ కుటుంబం నుంచి ఆయన వారసులు ఎవ్వరూ పరిశ్రమలోకి రాకపోవడం ఆశ్చర్యకరమే. దీనిపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చేవి కూడా . అయితే దీనికి చంద్రమోహన్ స్వయంగా ఆన్సర్ ఇచ్చారు.

తనకు ఇద్దరు కుమార్తెలని.. ఇద్దరు బాగుంటారని, ఒకానొక సమయంలో భానుమతి గారు పిల్లలిద్దరినీ చైల్డ్ ఆర్టిస్టులుగా చేద్దామని అడిగారని, కాను తాను వద్దన్నని చంద్రమోహన్ తెలిపారు. నటుడిగా బిజీగా వున్న రోజుల్లో తనకు పిల్లలతో గడిపే సమయం కూడా వుండేది కాదన్నారు. అంతేకాదు పిల్లలు ఎప్పుడైనా లోకేషన్ కు వచ్చినా వాళ్లు తనను గుర్తు పట్టేవాళ్లు కాదని చంద్రమోహన్ అన్నారు. అంతేకాదు..

తనలా వాళ్లు ఇండస్ట్రీలో అడుగుపెట్టడం ఇష్టం లేదని, అలాగే సినిమా ప్రభావం పడకుండా పెంచామని ఆయన చెప్పారు. అందుకు తగ్గట్లుగానే ఇద్దరు కుమార్తెలు కూడా బాగా చదివి గోల్డ్ మెడల్స్ అందుకుని, మంచి ఉద్యోగాలు సాధించారని చంద్రమోహన్ పేర్కొన్నారు. సో.. అదన్న మాట స్టోరీ.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus