అది ఫోటోషాప్ కాదండీ.. వీడియో ప్రూఫ్ ఇదిగో…!

  • September 15, 2020 / 12:58 PM IST

ఎన్నడూ లేని విధంగా మెగాస్టార్ చిరంజీవి… ఇటీవల గుండు లుక్ తో కనిపించి అందరినీ షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ‘నిజంగా చిరు గుండు చేయించుకున్నారా?’ అని కొందరు.. ‘లేదు ఇది ఫోటో షాప్ అని మరికొందరు’ కామెంట్లు పెట్టారు. ‘ఈ లుక్ భవిష్యత్తులో ఓ సినిమా కోసం’ అనే టాక్ కూడా రావడంతో.. ‘కచ్చితంగా ఇది..దర్శకుడు మెహర్ రమేష్ పనే’ అని మరికొందరు కామెంట్లు పెట్టారు. మెహర్ రమేష్ డైరెక్షన్లో మెగాస్టార్ ‘వేదాలం’ రీమేక్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. అందుకే చిరు ఈ లుక్ లోకి మారారు అంటూ కూడా కామెంట్స్ వినిపించాయి.

సరే ఈ లుక్ వెనుక ఎంతమంది కష్టం ఉందనేది తాజాగా చిరు రివీల్ చేస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. ‘మేకింగ్ ఆఫ్ ది అర్బన్ మాంక్’ అంటూ చిరు గుండు లుక్ ఎలా సాధ్యమైందో ఓ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.ఇది ఫోటో షాప్ కాదు.. చిరు గుండు కూడా చేయించుకోలేదు.ఈ లుక్ కోసం ఓ టీం పనిచేసినట్టు ఈ వీడియో స్పష్టం చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

అది పూర్తయిన తరువాత ‘లూసిఫర్’ రీమేక్ .. అలాగే ‘వేదాలం’ రీమేక లలో నటించబోతున్నారు. ఎక్కువ శాతం ‘వేదాలం’ రీమేకే ముందుగా సెట్స్ పైకి వెళ్లే అవకాశంఉంది . మెహర్ రమేష్ డైరెక్ట్ చెయ్యబోతున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, చరణ్ లు కలిసి నిర్మించనున్నారు. సెప్టెంబర్ 22న ఈ ప్రాజెక్టుకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ బలంగా వినిపిస్తుంది.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus