బిగ్ బాస్ హౌస్ లో రెండోవారం ఎలిమినేషన్ అనేది అత్యంత నాటకీయంగా జరిగింది. ఫస్ట్ వారం ఎలిమినేషన్ తీసేసిన బిగ్ బాస్ టీమ్, రెండోవారం ఏకంగా డబుల్ ఎలిమినేషన్ కి తెరలేపాడు. ఈ విషయాన్ని నాగార్జున చెప్తూనే డబుల్ ఎలిమినేషన్ పద్దతిని వైవిద్యంగా చూపించారు. ఆట ఎవరు బాగా ఆడట్లేదు, టైమ్ పాస్ చేస్తున్నారు అనిపించిన ఇంటి సభ్యులని నాగార్జున సెలక్ట్ చేసి నిలబెట్టాడు. దీంతో 9మంది హౌస్ మేట్స్ నామినేషన్స్ లో నిలబడినెట్టి నిలబడ్డారు.
ఇక్కడే మిగిలిన 11మంది హౌస్ మేట్స్ ని ఓటింగ్ వేయమని ఇందులో వేస్ట్ గా గేమ్ ఆడిన వాళ్లు బయటకి వచ్చేస్తారని చెప్పాడు. హౌస్ మేట్స్ అందరూ కలిసి శ్రీసత్య, వాసంతీ, ఇంకా షానీ ఈ ముగ్గురకీ మూడు ఓట్లు అంటే ఈక్వల్ గా ఓట్లు అనేది వేశారు. ఈ ముగ్గురి నుంచీ ఆడియన్స్ కూడ ఒకరి పేరు చెప్పారని వాళ్లనే నేను ఎలిమినేట్ చేస్తున్నానంటూ షానీ పేరు చెప్పి ఎలిమినేట్ చేసేశారు. దీంతో హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతేకాదు, ఈఎలిమినేషన్ ప్రోసెస్ అనేది బిగ్ బాస్ ఆడియన్స్ కి కూడా అంతగా రుచించలేదు.
బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ లో ఉన్నవారినే ఎలిమినేట్ చేయాలి. అది కూడా పబ్లిక్ ఓటింగ్ ని బట్టీ చేయాలి. లేదంటే పబ్లిక్ ఓటింగ్ కి వాల్యూ లేదు. అలా కాకుండా హౌస్ మేట్స్ ఓటింగ్ ని బట్టీ తీస్తే హౌస్ లో వ్యతిరేఖత ఉన్నవాళ్లు ఎలిమినేట్ అయిపోవాలి. ఇప్పుడు షానీ విషయంలో నిజానికి జరిగింది ఇదే. కానీ, షానీ నామినేషన్స్ లో ఉన్నాడని, లీస్ట్ ఓటింగ్ జరిగిందని, పబ్లిక్ కోరుకున్నది కూడా ఇదే అంటూ నాగార్జున కవర్ చేశారు. ఇక షానీని ఎలిమినేషన్ చేసిన పద్దతే బాగోలేదని ఆడియన్స్ ఇప్పుడు ఫైర్ అవుతున్నారు.
షానీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. గేమ్ బాగా ఆడనివాళ్లని నాగార్జున నిలబెట్టాలి కానీ, షానీి టాస్క్ లో పార్టిసిపేట్ చేశాడని అయినా కూడా షానీని ఎందుకు నిలబెట్టారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, షానీ నాగార్జున దగ్గర మాట్లాడుతున్నా కూడా మాట్లాడనివ్వలేదని ఫైర్ అవుతున్నారు. ఇక షానీకి స్టేజ్ పైకి పిలిచి కనీసం టైమ్ కూడా ఇవ్వలేదు, జెర్నీ కూడా చూపించకుండానే పంపించేశారని కామెంట్స్ చేస్తున్నారు.
ఒక హౌస్ మేట్ కి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై బిగ్ బాస్ టీమ్ ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు బిగ్ బాస్ బజ్ లో శివకి ఇచ్చిన ఇంటర్య్వూలో కూడా షానీ ఇవే మాటలు చెప్పడం అనేది సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. అదీ మేటర్.