Baby Movie: రెండు సినిమాలు తీస్తే.. కట్‌ చేసి ఒకటి చేశారా? సాయిరాజేశ్‌ క్లారిటీ!

‘బేబీ’… గత రెండు వారాలుగా టాలీవుడ్‌లో ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. చిన్న సినిమాగా మొదలైన ఈ సినిమా ఇప్పుడు భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో విడుదలైనప్పటి నుండి ఏదో ఒక చర్చ, రచ్చ, పుకార్ల ప్రకంపన నడుస్తూనే ఉంది. ఈ మొత్తం వ్యవహారం దర్శకుడు సాయిరాజేశ్‌ చుట్టూనే తిరుగుతోంది. చిరంజీవి ముఖ్య అతిథిగా ఇటీవల జరిగిన సినిమా ప్రచార కార్యక్రమంలో ఈ సినిమా ఇప్పుడు ఇలా రావడంలో దర్శకుడు మారుతి హస్తం ఉందని తేలిపోయింది.

ఆ సభలో చిరంజీవి మాట్లాడుతూ… మారుతి పేరును ప్రముఖంగా ప్రస్తావించారు. దీంతో అసలు ఈ సినిమాలోకి మారుతి ఎలా వచ్చారు, అంత ప్రముఖంగా ఎందుకు మారారు అనే చర్చ నడిచింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ప్రచారంలో, రిలీజ్‌ అయ్యాక తొలి నాళ్లలో జరిగిన ప్రచారంలో మారుతి ప్రస్తావన లేదు. అయితే తాజాగా సాయిరాజేశ్‌ మాట్లాడుతూ ‘బేబీ’ సినిమాలోకి వచ్చారు అనే విషయం చెప్పుకొచ్చారు. మారుతి ఈ సినిమాలో ఎంటర్‌ అవ్వడానికి నిడివే కారణం. అది కూడా మామూలు నిడివి కాదు.

‘బేబీ’ (Baby Movie) సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక చూసుకుంటే… సుమారు రెండు సినిమాల నిడివి వచ్చిందట. ప్రస్తుతం అందరూ చూస్తున్న ‘బేబీ’ సినిమా నిడివి సుమారు 3 గంటలు. అయితే తొలుత సిద్ధం చేసిన సినిమా ఐదు గంటల 25 నిమిషాలు. అవును మీరు చదివింది కరెక్టే. అంత పెద్ద సినిమాను సిద్ధం చేశారట సాయి రాజేశ్‌. దీంతో సినిమాను కుదించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో లాంగ్ షాట్లు కట్ చేస్తూ మూడు గంటల 35 నిమిషాలకు తీసకొచ్చారట.

అందులో సెకండాఫ్ నిడివే రెండు గంటలు వచ్చిందట. ఆ సమయంలో మారుతి సినిమాలోకి వచ్చారట. సినిమాను కట్ చేస్తూ చివరికి 3 గంటల రన్ టైం ఫైనలైజ్ చేశారట. ఆ తర్వాత ఇంకా తగ్గిస్తే బాగోదు అని అనుకుని అక్కడితే సినిమాను ఫైనల్‌ చేసి రిలీజ్‌ చేశారట. ఇదన్నమాట బేబీలో మారుతి కాన్సెప్ట్‌.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus