Keerthy Suresh: ‘సర్కారు వారి పాట’ లో కీర్తి సురేష్ ను తీసుకోవడానికి కారణం అదేనట..!

‘సర్కారు వారి పాట’ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పటి నుండీ అందులో హీరోయిన్ ఎవరు అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. చాలా మంది పేర్లు వినిపించాయి కానీ చివరికి కీర్తి సురేష్ ను ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించగానే మహేష్ బాబు అభిమానులు నిరాశకు లోనయ్యారు. అందుకు కారణం ఆమె నటించిన సినిమాలు అన్నీ డిజాస్టర్లు అవుతుండడం వల్లనే. ‘పెంగ్విన్’ ‘మిస్ ఇండియా’ ‘రంగ్ దే’ ‘పెద్దన్న’ వంటి సినిమాల్లో కీర్తి నటించింది.

అవన్నీ ప్లాప్ అయ్యాయి. దాంతో ‘సర్కారు వారి పాట’ పై వాళ్లకి అప్పటి నుండే టెన్షన్ మొదలైంది. గత వారం విడుదలైన ‘సర్కారు వారి పాట’ చిత్రానికి ప్లాప్ టాక్ లభించింది. కానీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. అయితే ఈ చిత్రంలో ఏమాత్రం ఫామ్లో లేని కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకోవడానికి గల కారణాల్ని చిత్ర బృందం వెల్లడించింది. ‘కీర్తి సురేష్ గారు ‘మహానటి’ తో ఆల్మోస్ట్ లేడీ సూపర్ స్టార్ రేంజ్లో క్రేజ్ ను సంపాదించుకున్నారు.

ఆమె సినిమా కోసం చాలా డెడికేటెడ్ గా పనిచేస్తారు. కళావతి పాత్రని అనుకున్నప్పుడు.. ఆ పాత్ర మహేష్ బాబు వంటి స్టార్ హీరోని మోసం చేసే విధంగా ఉంటుంది. కీర్తి సురేష్ వంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్ అయితేనే మహేష్ బాబు వంటి స్టార్ హీరోని మోసం చేయడానికి కరెక్ట్ గా సరిపోతుంది అప్పుడే.. హీరోయిన్ ట్రాక్ వర్కౌట్ అవుతుంది అనిపించింది. అందుకే కీర్తి సురేష్ గారినే ఎంపిక చేసుకున్నాం. మేము అనుకున్నట్టుగానే ఈ మూవీలో ఆమె బాగా పెర్ఫార్మ్ చేసింది. ఆమె పాత్ర జనాల్లోకి బాగా వెళ్ళింది.’ అంటూ చెప్పుకొచ్చారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus