కరోనా మహమ్మారి సినీ రంగంపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ వల్ల చాలా సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి. అయితే ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమైన శాకుంతలం సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరిగింది. దాదాపు 50 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. దర్శకుడు గుణశేఖర్ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేయడంతో శాకుంతలం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాపై కరోనా ప్రభావం పెద్దగా లేదని ముందుగా అనుకున్న ప్రకారం 2022 సంవత్సరంలోనే శాకుంతలం రిలీజవుతుందని తెలిపారు.
శాకుంతలం సినిమా స్క్రిప్ట్ ను చదువుతున్న సమయంలో తన కళ్ల ముందు శ్రీదేవి మెదిలారని శ్రీదేవి జీవించి ఉంటే ఆమెతో ఈ సినిమాను తెరకెక్కించేవాడినని గుణశేఖర్ అన్నారు. శ్రీదేవి తరువాత శాకుంతలం పాత్ర లక్షణాలు సమంతలో కనిపించాయని గుణశేఖర్ వెల్లడించారు. మరో ఆరు నెలల్లో శాకుంతలం షూటింగ్ మొత్తం పూర్తవుతుందని ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేస్తానని గుణశేఖర్ అన్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ కు 7 నెలల సమయం పడుతుందని గుణశేఖర్ వెల్లడించారు. సమంత కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సమంత పేరుపైనే శాకుంతలం సినిమా బిజినెస్ జరగనుండగా ఈ సినిమాతో సమంత ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!