ఎన్టీఆర్ ఇటీవల గాయాల పాలయ్యాడు. దీంతో అతను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ కండిషన్లో ఎన్టీఆర్ ను చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విషయం ఏంటంటే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘డ్రాగన్’ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడు. జిమ్లో అతను నాన్ స్టాప్ గా చేస్తున్న వర్కౌట్లను బట్టి అది అర్థం చేసుకోవచ్చు.
ఇంకో విషయం గమనిస్తే.. అతను ఇదివరకటితో పోలిస్తే.. చాలా బరువు తగ్గాడు. ఇంకో రకంగా చెప్పాలంటే బక్క చిక్కి పోయాడు అనొచ్చు. ప్రశాంత్ నీల్ సినిమా అంటే హెవీ యాక్షన్ సీన్స్ ఉంటాయి. పైగా ఎన్టీఆర్ తో అతను చేస్తున్నది పీరియాడిక్ మూవీ. సో లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అది కూడా ఎన్టీఆర్ పై ఒత్తిడి పెంచే విషయం అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ భారీ యాక్షన్ షెడ్యూల్లో ఎన్టీఆర్ గాయపడ్డాడు. పక్కటెముకుల దగ్గర అతనికి గాయమైంది.
తీవ్రమైన నొప్పితో అతను అల్లాడుతున్నాడు. ఈ సంగతి నిన్న ‘కాంతార చాప్టర్ 1’ ఈవెంట్ తో బయటపడింది. స్నేహితుడు రోషన్ శెట్టి కోసం ఎన్టీఆర్ ఈ వేడుకకు గెస్ట్ గా వచ్చాడు. ఈ వేడుకలో చాలా నీరసంగా కనిపించాడు. కూర్చోవడానికి, నిలబడడానికి ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడు. స్పీచ్ కూడా డల్లుగా ఉంది.
‘అరిచినట్టు మాట్లాడలేను.. నొప్పితో బాధపడుతున్నాను’ అంటూ ఓపెన్ గానే ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. ఎక్కువ సేపు కూడా ఎన్టీఆర్ ఉండలేకపోయాడు. అతని కోసమే అనుకుంట ఈవెంట్ ను కూడా ఫాస్ట్ గా మొదలుపెట్టి.. అంతే ఫాస్ట్ గా ముగించేశారు. మరోపక్క ఎన్టీఆర్ కోలుకునే వరకు ‘డ్రాగన్’ షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు.
ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాను..
జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి.. విజయదశిమి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోండి#JrNTR #RishabShetty #RukminiVasanth #KantaraChapter1 pic.twitter.com/04mhk1gtxx— Filmy Focus (@FilmyFocus) September 28, 2025