‘కాళీ’ పోస్టర్‌ వివాదంలో కొత్త మలుపులు.. ఏమైందంటే?

మలయాళీ దర్శకురాలు లీనా మణిమేగలై పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తం మారుమోగిపోతోంది. అంతగా ఆమేం చేసింది అనుకుంటున్నారా? ఓ డాక్యుమెంటరీ సినిమా పోస్టర్‌ను విడుదల చేసిందంతే. ‘కాళీ’ పేరుతో ఆమె విడుదల చేసిన ఆ పోస్టర్‌ తాజా వివాదానికి కేంద్ర బిందువైంది. దేవతా మూర్తిని అవమానించేలా ఉన్న ఆ పోస్టర్‌పై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ట్విటర్‌ తొలగించింది. ఆ పోస్టర్‌ విడుదలకు వేదికైన అగా ఖాన్‌ మ్యూజియం సారీ కూడా చెప్పింది. అయినా విషయం అక్కడితో ఆగేలా లేదు. కారణం ఆమె మళ్లీ అలాంటి ప్రయత్నమే చేయడం.

ట్వీట్ డిలీట్‌, మ్యూజియం సారీ చెప్పడంతో సమస్య సగం సమసినట్లే అనుకుంటుండగా… లీనా వివాదంలో ఆజ్యం పోశారు. మత విశ్వాసాలను దెబ్బతీసేలా లీనా చేతులు ఉన్నాయని దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లలో కేసులు నమోదైనా ఆమె వెనక్కి తగ్గడం లేదు. దేవుళ్ల వస్త్రధారణలో ఉన్న వ్యక్తులు సిగరెట్‌ తాగుతున్న ఫొటోను ట్వీట్‌ చేసింది లీనా. దాంతోపాటు ‘ఎక్కడో మరోచోట’ అని రాసుకొచ్చారు. వివాదానికి కారణమైన ‘కాళీ’ పోస్టర్‌ తరహాలోనే ఈ ఫొటో కూడా ఉండటం గమనార్హం.

‘కాళీ’ వివాదం విషయంలో తనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో.. తాజా పోస్ట్‌తో లీనా తన వాదనను సమర్థించుకునేయత్నం చేసింది అని చెప్పొచ్చు. ఇక తొలి పోస్టర్‌ తర్వాత దుమారం రేగడంతో కెనడాలోని భారతీయ హైకమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. మనోభావాలను దెబ్బతీస్తూ, వర్గాలను రెచ్చ గొట్టేవిధంగా ఉన్న మెటీరియల్‌ను వెంటనే తొలగించాలని కెనడా అధికారులతోపాటు కార్యక్రమ నిర్వాహకులకు సూచించింది. స్పందించిన అగా ఖాన్‌ మ్యూజియం ‘కాళీ’ పోస్టర్‌ మతవిశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని హిందూ సమాజం నుంచి ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది.

ఈ పరిణామానికి చింతిస్తున్నామని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ఫొటోను దేవతా మూర్తిని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అందులో దేవతామూర్తి సిగరెట్‌ తాగుతూ ఉండడం, బ్యాక్‌గ్రౌండ్‌లో స్వలింగ సంపర్కుల జెండా వంటివి ఉండటం తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. దేశవ్యాప్తంగానే కాక, కెనడాలోని హిందూ సమాజం నుండి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. దీంతో అగా ఖాన్‌ మ్యూజియం సారీ చెప్పింది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!</strong

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus