Liger Movie: ‘లైగర్’ ఓటిటి డీల్ వెనుక అనుమానాలు…మేటర్ ఏంటి?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. యంగ్ టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ‘లైగర్’ అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘లైగర్’ షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.అయితే ఇప్పుడు షూటింగ్ లకు అనుమతులు లభించడంతో తిరిగి కొత్త షెడ్యూల్ ను ప్రారంభించాలని దర్శకుడు పూరి ప్లాన్ చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుండీ ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటిటి సంస్థల నుండీ ఏకంగా రూ.200 కోట్ల భారీ ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతుంది. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు కూడా నిన్నటి నుండీ సోషల్ మీడియాలో ఆకాశమే హద్దు అన్నట్టు హడావిడి చేస్తున్నారు. అయితే ఈ వార్తలో నిజం లేదు అని ఇన్సైడ్ టాక్. కరణ్ జోహార్ ను అమెజాన్, మరియు నెట్ ఫ్లిక్స్ వారు సంప్రదించి… లైగర్ కు గానూ 200 కోట్లు ఆఫర్ చేశారనేది ఆ ప్రస్తుతం ప్రచారమవుతున్న వార్త సారాంశం.ఈ విషయం పై బాలీవుడ్ మీడియాని ఆరా తీయగా.. అదంతా పబ్లిసిటీ స్టంట్ అని వారు తేల్చేశారు.

సినిమాకి భారీగా హైప్ తీసుకురావడం కోసం చిత్ర యూనిట్ సభ్యులు క్రియేట్ చేసిన గాసిప్ అని వారు చెప్పుకొచ్చారు. ఇక మరోపక్క టాలీవుడ్ విశ్లేషకులు.. పూరి సినిమాలకు ఆ రేంజ్ డిమాండ్ ఉండదని పేర్కొంటున్నారు. తెలుగులో ఇప్పటి వరకు పూరి తీసిన సినిమాల్లో .. 100 కోట్లు బిజినెస్ చేసిన సినిమా ఒక్కటి కూడా లేదు. ఇక ధియేట్రికల్ పరంగా .. రూ.50 కోట్లు షేర్ వసూల్ చేసిన సినిమా ఒక్కటి కూడా లేదు. పైగా లైగర్ కు తెలుగు,హిందీ లో తప్ప మరి ఏ భాషలోనూ హైప్ లేదు. అలాంటప్పుడు ఈ సినిమాకి రూ.200 కోట్ల ఆఫర్ ఎలా వస్తుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus