Mega 156: వైరల్ అవుతున్న మెగా 156 పోస్టర్..!

భోళా శంకర్‌’ చిత్రం విడుదలకు ముందే చిరంజీవి రెండు చిత్రాలు కమిట్‌ అయినట్లు వార్తలొచ్చాయి. ఆయన పుట్టిన రోజున ఆ రెండు చిత్రాలకు సంబంధించి అధికారిక ప్రకటనలు వచ్చాయి. అందులో ఒకటి మెగా 156 చిరు తనయ సుష్మిత నిర్మాణంలో అని ప్రచారం జరిగింది. మెగా 157 యువీ క్రియేషన్స నిర్మాణంలో ‘బింబిసారా’ ఫేం వశిష్ఠ దర్శకత్వంలో ప్రకటించారు. ఇప్పటికే మెగా 156 చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.

అయితే తాజాగా చిరు చిన్న మార్పు చేశారు. వశిష్ట దర్శకత్వం వహించబోయే చిత్రం మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మెగా 157 ముందు కాబట్టి ఇప్పుడు వశిష్ట డైరెక్ట్‌ చేస్తున్న సినిమానే ముందుగా విడుదలవుతుందని క్లారిటీ వచ్చింది. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను మెగా 156గా మార్పు చేసి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి-వశిష్ఠ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సాయిమాధవ్‌ బుర్ర మాటలు అందిస్తున్నారు.

దసరా సందర్భంగా మంళవారం ఈ చిత్రం (Mega 156) పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక సుష్మిత నిర్మించబోయే చిత్రం విషయానికొస్తే.. ‘సోగ్గాడే చిన్నినాయన’ దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే చిరు పుట్టినరోజున గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైనమెంట్‌ సంస్థ ద్వారా సుష్మిత వదిలిన పోస్టర్‌లో దర్శకుడి పేరు లేదు. మరి ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహిస్తారనేది తెలియాలి.

https://twitter.com/DirVassishta/status/1716672678151733571?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1716672678151733571%7Ctwgr%5E8c15c24d31614e0e13581071b1e2557aee7b259d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftwitframe.com%2Fshow%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FDirVassishta%2Fstatus%2F1716672678151733571

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus