యాంకర్ ప్రదీప్ వల్ల స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) తిట్లు తినాల్సి వచ్చిందట. అదెలా అనుకుంటున్నారా? త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు ‘జులాయి’ (Julayi) ‘అత్తారింటికి దారేది’ ల్లో (Atharintiki Daaredi) ప్రదీప్ చిన్న రోల్స్ చేశాడు. ఇందులో ‘అత్తారింటికి దారేది’ లో ప్రదీప్ (Pradeep Machiraju) చేసిన రోల్ లేడీస్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చలేదట. దీంతో త్రివిక్రమ్ ని అందరూ తిట్టిపోశారని ప్రదీప్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు.
ప్రదీప్ మాట్లాడుతూ… “చిన్న రీల్ కి 30 మినిట్స్ వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ నా రోల్ కి ఎంత నిడివి ఉంటుంది అని ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. ‘జులాయి’ సినిమాలో అల్లు అర్జున్ కి ఫ్రెండ్ రోల్ అని త్రివిక్రమ్ గారి ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది అని తెలిసి ‘భలే ఉంది ఇది.. ఎక్కడో నక్క తోక తొక్కాను’ అని ఫీల్ అయ్యాను.
నా షోలు చూసి…’ఈ అబ్బాయి తెలుగు బాగా మాట్లాడుతున్నాడు నాన్-స్టాప్ గా’ అని ఆయన సినిమాల్లో ఛాన్సులు ఇచ్చారు. తర్వాత ‘అత్తారింటికి దారేది’ లో కూడా ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ సినిమా చూశాక.. త్రివిక్రమ్ గారు ఆయన ఇంట్లో వాళ్ళతో తిట్లు తిన్నారట. ‘ఆ అబ్బాయి బాగా మాట్లాడతాడు కదా.. అలాంటి వాడితో చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టి.. ఏమీ మాట్లాడకుండా చేశారు’ అని ఆయన ఇంట్లో వాళ్ళు అన్నారట.
బయట కూడా చాలా మంది అలాగే అన్నారని ఆయన చెప్పారు. దీంతో త్రివిక్రమ్ గారు ‘నీకు ఇలాంటి రోల్స్ ఇస్తే నన్ను తిడుతున్నారు. నువ్వు కామెడీ బాగా చేస్తావు.. ఎందుకు చేయించలేదు అని అంటున్నారు. ఇంకెప్పుడూ ఇలాంటి రోల్స్ నీకు వద్దు. నువ్వు కూడా కాస్త లెన్తీ రోల్స్ వస్తే చెయ్యి’ అని అన్నారు. అందుకు నేను కూడా ఓకే అన్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది
నాకు డైలాగ్స్ ఇవ్వలేదని… త్రివిక్రమ్ గారిని ఇంట్లో వాళ్లే తిట్టారంట!
Full Interview: [https://t.co/li60i0xUPc]#PradeepMachiraju #Trivikram #AtharintikiDaaredi #PawanKalyan #FilmyFocusOriginals pic.twitter.com/yBU2m7SQ1f
— Filmy Focus (@FilmyFocus) April 6, 2025