రవితేజ హీరోగా శరత్ మండవ డైరెక్షన్ లో తెరకెక్కిన రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాగా ఈ సినిమాకు బుకింగ్స్ పరవాలేదనే స్థాయిలో ఉన్నాయి. దర్శకుడు శరత్ మండవ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మిస్సింగ్ కేసును సివిల్ ఆఫీసర్ ఎందుకు డీల్ చేశాడనే కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని శరత్ మండవ చెప్పుకొచ్చారు.
కలెక్టరేట్ తో ముడిపడిన అన్ని అంశాలను ఈ సినిమాలో ప్రస్తావించామని కోర్టులు పని చేయని సమయంలో ఆదేశాలు ఇచ్చే హక్కు కలెక్టరేట్ కు ఉంటుందని సినిమాలో ఆ అంశాలను ప్రస్తావించామని ఆయన చెప్పుకొచ్చారు. రవితేజ ఇమేజ్ కు అనుగుణంగా కథలో మార్పులు చేస్తున్నామని ఆయన తెలిపారు. రామారావ్ ఆన్ డ్యూటీలో ఫన్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. చాలారోజుల క్రితమే రామారావ్ ఆన్ డ్యూటీ కథను రవితేజకు చెప్పానని ఆయన తెలిపారు.
రామారావు అనే పేరు పవర్ ఫుల్ పేరు అని ఆ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ మరణించి చాలా సంవత్సరాలు అయినా ఒక సర్వేలో ఆయన పేరు వచ్చిందని ఆ పేరును పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో అయ్యారని అదే పేరు పెట్టుకున్న కేటీఆర్ గ్రేట్ లీడర్ అని శరత్ మండవ కామెంట్లు చేశారు. రామారావ్ ఆన్ డ్యూటీలో వేణు రోల్ ఆసక్తికరంగా ఉంటుందని శరత్ మండవ చెప్పుకొచ్చారు.
ఖర్చు విషయంలో రాజీ పడకుండా నిర్మాతలు ఈ సినిమాను నిర్మించారని శరత్ మండవ తెలిపారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని ఆ సంఘటనలో నా రియల్ లైఫ్ లో జరిగిన ఒక సంఘటన కూడా ఉందని శరత్ మండవ అన్నారు. మంచి చెడు మాత్రమే మన చేతిలో ఉంటుందని హిట్ ఫ్లాప్ అనేది మన చేతిలో ఉండదని ఆయన కామెంట్లు చేశారు. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఆయన తెలిపారు.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!