అల్లు కుటుంబం – పవన్ కల్యాణ్ మధ్య సయోధ్య లేదు… గత కొన్ని నెలలుగా టాలీవుడ్‌లోని ఓ సెక్షన్ మీడియాలో వినిపిస్తున్న మాట ఇది. ఇందులో నిజా నిజాలు ఎంత అనేది తెలియదు కానీ… ఏదో ఉంది అనే వాసన మాత్రం ఆగలేదు. తాజాగా విడుదలైన ‘భీమ్లా నాయక్’ గురించి అల్లు అర్జున్ ఇప్పటివరకు ట్వీట్ చేయకపోవడం ఆ పుకార్లకు ఆద్యం పోసినట్లు అయ్యింది. అయితే ఇక్కడ చాలామంది అర్థం కాని విషయం ఏంటంటే… ఆ కుటుంబంతో పడదు అంటూ వార్తలొస్తున్నప్పటికీ… అదే కుటుంబానికి చెందిన ‘ఆహా’కి ‘భీమ్లా నాయక్’ ఓటీటీ రైట్స్ ఎలా ఇచ్చారు అనేదే.
‘భీమ్లా నాయక్’ను ఓటీటీ చూడాలంటే… ‘ఆహా’ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే అంటూ త్వరలో యాడ్‌లు మీద యాడ్‌లు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీ రైట్స్‌ను అల్లు అరవింద్ అండ్ కో కొనేసింది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి డేట్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేస్తారు అని టాక్. ఆ తర్వాత ఇక యాప్ ప్రచారంలో ‘భీమ్లా నాయక్’ సినిమానే కనిపిస్తుందని ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్లు ఇప్పటికీ ‘అఖండ’ సినిమాతోనే ప్రమోట్ చేసుకుంటున్నట్లు.
ఇదంతా… సినిమాను ఆహా తీసుకుంది అని చెప్పడానికి. అయితే కాస్త రివైండ్ చేసుకుంటే ఆహా వచ్చిన కొత్తల్లో డబ్బింగ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మలయాళం, కన్నడ, తమిళంలో మంచి విజయం అందుకున్న సినిమాలను ఇక్కడ తీసుకొచ్చేవారు. వరల్డ్ ప్రీమియర్ అంటూ ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత మెల్లగా తెలుగు స్ట్రెయిట్ సినిమాలు కొనడం ప్రారంభించారు. థియేటర్‌లో వచ్చిన పెద్ద సినిమాలు కొన్నారు. ‘క్రాక్’ అలా వచ్చిందే. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ కూడా.
‘భీమ్లా నాయక్’ ఓటీటీ డీల్ పవన్ కల్యాణ్‌కు తెలియకుండా జరిగింది అని అనుకోలేం. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ విషయం పవన్‌కి, త్రివిక్రమ్‌కి చెప్పే చేస్తుంది. అయినా అల్లు కాంపౌండ్‌లోకి ఈ సినిమా వెళ్లడం చాలామందికి ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే పవన్ – అల్లు మధ్య ఎలాంటి సమస్య లేకపోయుండాలి. ఒకవేళ అదే అయితే ఇప్పటివరకు అల్లు అర్జున్ సినిమా గురించి ఎందుకు మాట్లాడలేదు. అదీ ఏఎంబీ సినిమాస్‌లో సినిమా చూసి మరీ.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!