Jr NTR: ఆ కారణంతోనే ఎన్టీఆర్… ‘ఊపిరి’ ని వద్దనుకున్నాడా..!

నాగార్జున, కార్తీ హీరోలుగా తెరకెక్కిన ‘ఊపిరి’ చిత్రం 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్నే అందుకుంది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. బైలింగ్యువల్ మూవీగా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ మూవీ తెరకెక్కి రెండు చోట్ల ఏకకాలంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో ‘తోజా’ పేరుతో రిలీజ్ అయిన మూవీ మొదట అక్కడ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అక్కడ కార్తీకి ఉన్న ఇమేజ్ కారణంగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది.

Click Here To Watch Now

ఈ మూవీలో నాగ్ తో పాటు కార్తీ కూడా అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అయితే ‘ఊపిరి’ కి కార్తీ ప్లేస్ లో మొదట ఎన్టీఆర్ ను అనుకున్నారు. కానీ తర్వాత ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నాడు. దీనికి కారణాలు ఏంటి అన్నది ఇప్పటి వరకు బయటకి రాలేదు. అయితే తాజాగా ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్లలో పాల్గొంటున్న ఎన్టీఆర్ కు ‘ఊపిరి’ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ‘మీ తాతగారిలా మీరు కూడా భవిష్యత్తులో ఎక్కువ మల్టీస్టారర్లు చేసే అవకాశం ఉందా?

చేస్తే ‘ఆర్.ఆర్.ఆర్’ లా బిగ్ బడ్జెట్ లేదా బిగ్ స్పాన్ ఉన్న మూవీస్ మాత్రమే చేస్తారా? ఎందుకంటే గతంలో మీరు ‘ఊపిరి’ ని చేయలేదు కదా’ అనే ప్రశ్న ఎన్టీఆర్ కు ఎదురైంది. ‘దీనికి ఎన్టీఆర్ బిగ్ బడ్జెట్ లేదా స్పాన్ ఉన్న మూవీస్ మాత్రమే చేస్తాను అని చెప్పడం లేదు. బడ్జెట్ అనేది ప్రొడ్యూసర్ డిసైడ్ చేసుకోవాలి. అలాగే బిగ్ స్పాన్ అనేది కథ డిసైడ్ చేయాలి. ఓ దర్శకుడు నా దగ్గరకి మంచి మల్టీస్టారర్ కథతో వస్తే కనుక..

అది అతను హ్యాండిల్ చేయగలడు అనే నమ్మకం ఉంటే కచ్చితంగా ఓకె చేస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. దీనిని బట్టి ‘ఊపిరి’ కథని దర్శకుడు వంశీ పైడిపల్లి సరిగ్గా హ్యాండిల్ చేయలేడు అని భావించి ఎన్టీఆర్ వదిలేసి ఉంటాడు అని స్పష్టమవుతుంది. ఒకవేళ ఎన్టీఆర్ కనుక ఆ మూవీలో భాగం అయితే స్క్రిప్ట్ లో మార్పులు చేయాల్సి వచ్చేది. అప్పుడు సోల్ కూడా దెబ్బతినేది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus